అజ్మీర్: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఆదివారం మధ్యాహ్నం వేగంగా వస్తున్న బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు తుక్కై నామరూపాలు లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదా చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment