రాజేంద్రప్రసాద్ ఇంట్లో చెల్లాచెదురైన వస్తువులు.. లోతుకుంటలో..
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నగరంలో అనేక ఇళ్లకు తాళాలు పడ్డాయి...ఊరెళ్లేప్పుడు సమీపంలోని ఠాణాలో సమాచారం ఇచ్చి వెళ్లండి అంటూ పోలీసులు ప్రకటనలు కూడా గుప్పించారు. అంతవరకూ బాగానే ఉంది... ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో...బంగారం, నగదు ఎలా భద్రపరచాలో చెప్పడం మరిచారు. మరోవైపు పోలీస్ నిఘా అంతంతే ఉండడంతో శుక్రవారం ఒక్కరోజే మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పదకొండు చోరీలు వెలుగుచూశాయి. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో నాలుగు ఇళ్లు, జీడిమెట్లలో ఒకటి, మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఆరు ఇళ్ల తాళాలు పగిలాయి.
సాక్షి, అల్వాల్ : నాలుగు ఇళ్లలో దొంగలు వరస చోరీలకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం వెలుగులోకి వచి్చంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.లక్ష్మీనగర్ ఫేస్–2లో ఉంటున్న సంతోష్, సంధ్య దంపతులు ఇంటికి తాళంవేసి సంక్రాంతి పండుగ సందర్భంగా మియాపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువాను బద్దలు కొట్టి అందులో ఉన్న రూ. 2లక్షల నగదు. 6.5 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. వీరి పక్కనే ఉంటున్న అశోక్‌కుమార్ ఇంట్లో 8 తులాల బంగారు నగలు రూ. 30 వేల నగదు చోరీకి గురయ్యాయి. పక్క భవనంలో ఉంటున్న సాయికుమార్, సురేందర్‌రెడ్డి ఇళ్లలో 8 తులాల బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆరు ఇళ్లలో చోరీ..
మీర్‌పేట: తాళాలు వేసి ఉన్న ఆరు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుర్రంగూడ రోడ్ నెం–8లో ఉంటున్న కొర్ర రాజేంద్రప్రసాద్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న ఇంటికి తాళం వేసి తన స్వగ్రామానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించిన అతను లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 4 తులాల బంగారు, నగదు కనిపించలేదు. సమీపంలోనే నూతనంగా నిరి్మంచిన ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించిన అతను పోలీసులకు సమా చారం అందించాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
8 తులాల బంగారు నగలు మాయం
జీడిమెట్ల: ఇంటి తాళాలు పగులగొట్టి బీరువా ఉన్న 8తులాల నగలు ఎత్తుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ సుమన్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, రామేశ్వరం గ్రామానికి చెందిన సంతో‹Ùరెడ్డి çకుటుంబంతో సహా సూరారం డివిజన్, సంజయ్ గాంధీ నగర్‌లో ఉంటున్నాడు. ఈ నెల 12న అతను కుటుంబంతో స్వగ్రామానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 8 తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించిన సంతో‹Ùరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment