నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ, సీఐ
తిరుపతి క్రైం: నమ్మకంతో చేరదీసి పని కల్పించిన యజమాని ఇంట్లోనే దొంగతనా నికి పాల్పడిన భార్యాభర్తలను క్రైం పోలీసులు అరెస్టు చేశారు. క్రైం డీఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు పశ్చిమ గోదా వరి జిల్లా తాడేపల్లి గూడేనికి చెందిన రావుపాటి మోహన్ (31) ఉపాధి నిమిత్తం తిరుపతికి వచ్చాడు. తాతయ్యగంట వద్ద త్యాగరాజు నిర్వహిస్తున్న వెంల్డింగ్‌షాపులో పనికి చేరాడు. అనంతరం కొద్దిరోజులకు తిరుపతికి చెందిన జ్యోతిని వివాహం చేసుకుని సంజీవయ్యనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు. మద్యంకు బానిసైన మోహన్ భార్య జ్యోతితో కలసి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా యజమాని త్యాగరాజు కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్నారు.
ఇంట్లో నగలు, నగదు ఎక్క డ ఉంచుతారో తెలుసుకున్నారు. యజమా ని ఇంటి తాళాలు దొంగలించి నకిలీ తాళం తయారు చేశారు. కుటుంబ సమేతంగా యజమాని బెంగళూరుకు వెళ్లిన సమయంలో భార్యాభర్తలు ఇంట్లోకి వెళ్లి నగదు, నగలు దోచుకెళ్లారు. ఊరి నుంచి వచ్చిన తర్వా త యజమాని దొంగతనం జరిగినట్టు గుర్తించి గతనెలలో ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు క్రైం సీఐ భాస్కర్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నింది తులు సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండులో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.7.23 లక్షలు విలువ చేసే 241 గ్రాముల బంగా రు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసు కు న్నారు. ఈ కేసును చేధించిన సిబ్బందికి రివార్డు వచ్చేలా కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment