ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు
రేణిగుంట: మామండూరు అటవీప్రాంతంలో మంగళవారం రాత్రి తిరుపతి టాస్క్‌ఫోర్స్ అధికా రులు, అటవీశాఖ అధికారులు నిర్వహించిన సం యుక్త ఆపరేషన్‌లో 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఓ కూలీని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఐజీ మాగంటి కాంతారావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఐ సత్యనారాయణ, అటవీశాఖ డీఆర్‌ఓ నారాయణ ఆధ్వర్యంలో రెండు బృందాలు మామండూరు గంజిబండల అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. సాయంత్రం పొద్దుపోయాక గంజిబం డల ప్రాంతంలో వారికి 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. వారిలో తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకు చెందిన తంగవేలు రాము(42)ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు అడవిలోకి పారిపోయారు.
వారి వద్దనున్న 31 దుంగలను అక్కడే పడేసి వెళ్లిపోయారు. పట్టుబడిన స్మగ్లరును విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని టాస్క్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. మొదట జువ్వాదిమలై నుంచి ఇద్దరిద్దరు చొప్పున బస్సులో తిరుపతికి చేరుకున్నారని, ముందుగా అనుకున్న విధంగా అందరూ శుక్రవా రం తిరుమలకు చేరుకుని అడవిలోకి వెళ్లారని టాస్క్‌ఫోర్స్ అధికారులు వివరించారు. నరికిన 31 ఎర్రచందనం దుంగలను కడప మార్గంలో రోడ్డుకు సమీపంలో దాచి స్వగ్రామాలకు చేరుకునేలా ప్ర ణాళికాబద్ధంగా అడవిలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. కాగా టాస్క్‌ఫోర్స్ ఐజీ మాగంటి కాంతారావు మంగళవారం రాత్రి ఘటన జరిగిన వెంటనే మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకుని ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. పట్టుబడిన ఎర్ర కూలీని ప్రశ్నించారు. అనంతరం
టాస్క్‌ఫోర్స్ డీఎస్పీలు హరినాథబాబు, పీవీ రమణ, ఆర్‌ఐ మురళి, ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మీపతి ఆపరేషన్ టీంకు అభినందనలు తెలిపారు. ఈ దాడుల్లో డీఆర్‌ఓ నారాయణ, ఎఫ్‌బీఓ నీరజాక్షి, లక్ష్మీదేవమ్మ, శంకరన్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం పాల్గొన్నారు. కాగా చంద్రగిరిలోనూ 7 ఎర్రదుంలను వాహనం సహా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment