Red wood smuggling
-
నాడు టెలికాం ఇంజినీర్ నేడు అంతర్జాతీయ స్మగ్లర్
కడప అర్బన్ : తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి చెందిన ఎత్తిరాజులు శ్రీనివాసులు అలియాస్ నాయుడు బీఎస్సీ (కెమిస్ట్రీ), బీసీఏ వరకు చదివి సత్యం కంప్యూటర్స్‌లో టెలికాం ఇంజనీర్‌గా పని చేశాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎనిమిదేళ్ల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారిగా మారాడు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ సుమారు 600 టన్నుల మేరకు ఎర్రచందనం దుంగలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించాడు. ఇతనిపై జిల్లాలో 25 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని యథేచ్ఛగా స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, హర్యాన, గుజరాత్, రాజస్థాన్, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ∙ఇటీవల కాలంలో రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబుళవారిపల్లె ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేసిన ఎర్రచందనం స్మగ్లర్ల విచారణలో ఎత్తిరాజులు శ్రీనివాసులు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ∙శ్రీనివాసులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్మగ్లర్లతో సంబంధాలను ఏర్పరచుకుని చెట్లు నరికేవారిని రాయలసీమ జిల్లాలలోని శేషాచలం, లంకమల్ల, నల్లమల అటవీ ప్రాంతాల్లోకి పంపించి వారి ద్వారా ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడేవాడు. ∙పోలీసులకు పట్టుబడటం ఇదే మొదటి సారి. ఎనిమిదేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగాడు. ఇతను దుబాయ్‌లో ఉంటున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు సాహుల్‌భాయ్, మన్సూర్, బిలాల్లకు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ∙గ్రానైట్ రాళ్లు, సిరామిక్ టైల్స్, ఆహార ధాన్యాలు, కొబ్బరిపీచు, ఇటుకలు, కూరగాయలు తదితర వాటి ఎగుమతి మాటున ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసి గమ్యస్థానాలకు చేర్చేవాడు. ∙జిల్లాలోని అటవీ ప్రాంతంల నుండి ఎర్రచందనం దుంగలను లారీలు, కంటైనర్లు, ఐచర్ వాహనాలు, విలువైన కార్లలో ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసి, అంతర్జాతీయ స్మగ్లర్లకు విక్రయిస్తూ ఉన్నాడు. ∙జిల్లాలోని రైల్వేకోడూరు మండలం ఉర్లగడ్డపోడు గ్రామానికి చెందిన తేనేపల్లి లక్షుమయ్య, గొంటు వినోద్ కుమార్‌లు శ్రీనివాసులుకు ప్రధాన అనుచరులుగా మారారు.తేనెపల్లి లక్షుమయ్యపై జిల్లాలో 9 కేసులు, గొంటు వినోద్ కుమార్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. నిందితులు పట్టుబడిన వైనం : ఇటీవల సేతు మాధవన్, షేక్ ముబారక్ అలి, ఆర్కాట్భాయ్, సత్యనారాయణ, గిరినాయుడులను రైల్వేకోడూరు పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఎత్తిరాజులు శ్రీనివాసులు అలియస్ నాయుడు ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు వ్యూహాత్మకంగా జిల్లా పోలీసు ప్రత్యేక బృందం అతని కదలికలపై నిఘా ఉంచి ఈనెల 24 రాత్రి తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలో వలపన్ని ఎత్తిరాజులు శ్రీనివాసులు అలియాస్ నాయుడును అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారం మేరకు రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వాగేటికోన చెరువు అలుగు సమీపంలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న అతని అనుచరులు తేనేపల్లి లక్షుమయ్య, గొంటు వినోద్ కుమార్‌లను సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 593 కిలోల బరువున్న 22 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లు, 59.4 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.13,470 నగదులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలను జిల్లా ఎస్పీ సోమవారం సాయంత్రం కడపలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సిబ్బందిని అభినందించిన ఎస్పీ :ఈ సంఘటనలో నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం ఆస్మి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి. శ్రీనివాసులు, రాజంపేట డీఎస్పీ బి. లక్ష్మినారాయణ, సీఐ పద్మనాభన్, ఎస్ఐలు కొండారెడ్డి, ఎం. భక్తవత్సలం, కానిస్టేబుళ్లు ఎస్. శివరాం నాయు డు, జి. వెంకటరమణ, సి. కొండయ్య, బి. గోపినాయక్, బి. సురేష్, కిరణ్ కుమార్, పి. రాకేష్‌లను ఎస్పీ బాబూజీ అట్టాడ అభినందించారు. -
మామండూరులో 31 ఎర్రదుంగలు స్వాధీనం
రేణిగుంట: మామండూరు అటవీప్రాంతంలో మంగళవారం రాత్రి తిరుపతి టాస్క్‌ఫోర్స్ అధికా రులు, అటవీశాఖ అధికారులు నిర్వహించిన సం యుక్త ఆపరేషన్‌లో 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఓ కూలీని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఐజీ మాగంటి కాంతారావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఆర్ఐ సత్యనారాయణ, అటవీశాఖ డీఆర్ఓ నారాయణ ఆధ్వర్యంలో రెండు బృందాలు మామండూరు గంజిబండల అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. సాయంత్రం పొద్దుపోయాక గంజిబం డల ప్రాంతంలో వారికి 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. వారిలో తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకు చెందిన తంగవేలు రాము(42)ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు అడవిలోకి పారిపోయారు. వారి వద్దనున్న 31 దుంగలను అక్కడే పడేసి వెళ్లిపోయారు. పట్టుబడిన స్మగ్లరును విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని టాస్క్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. మొదట జువ్వాదిమలై నుంచి ఇద్దరిద్దరు చొప్పున బస్సులో తిరుపతికి చేరుకున్నారని, ముందుగా అనుకున్న విధంగా అందరూ శుక్రవా రం తిరుమలకు చేరుకుని అడవిలోకి వెళ్లారని టాస్క్‌ఫోర్స్ అధికారులు వివరించారు. నరికిన 31 ఎర్రచందనం దుంగలను కడప మార్గంలో రోడ్డుకు సమీపంలో దాచి స్వగ్రామాలకు చేరుకునేలా ప్ర ణాళికాబద్ధంగా అడవిలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. కాగా టాస్క్‌ఫోర్స్ ఐజీ మాగంటి కాంతారావు మంగళవారం రాత్రి ఘటన జరిగిన వెంటనే మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకుని ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. పట్టుబడిన ఎర్ర కూలీని ప్రశ్నించారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీలు హరినాథబాబు, పీవీ రమణ, ఆర్ఐ మురళి, ఎఫ్ఆర్ఓ లక్ష్మీపతి ఆపరేషన్ టీంకు అభినందనలు తెలిపారు. ఈ దాడుల్లో డీఆర్ఓ నారాయణ, ఎఫ్బీఓ నీరజాక్షి, లక్ష్మీదేవమ్మ, శంకరన్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం పాల్గొన్నారు. కాగా చంద్రగిరిలోనూ 7 ఎర్రదుంలను వాహనం సహా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎర్రోళ్లు దర్జాగా..!
పోలీసుల ఎత్తులకు ఎర్ర చందనం స్మగ్లర్లు పైఎత్తులు వేస్తున్నారు. పోలీసులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నా అక్రమ రవాణా ఆగటం లేదు. పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టని రూట్లు చూసుకుని పలు మార్గాల్లో ఎర్ర చందనం రవాణా సాగిస్తున్నారు. అది కూడా సరికొత్త ఎత్తుగడతో పోలీసుల దుస్తుల్లో, అత్యాధునిక ఆయుధాలను ధరించి ఎర్రచందనాన్ని జిల్లాతో పాటు రాష్ట్రాలు దాటించేస్తున్నారు. ప్రత్యేకంగా ఉన్న రెండు ముఠాలు ఒక రూట్‌ను నిర్ణయించుకుని ఆ మార్గంలోనే అక్రమ రవాణా చేస్తున్నాయి. వీళ్లు కాకుండా వేరే ముఠా ఎవరైనా అటుగా అక్రమ రవాణా చేసినా దాడులు చేయటం, లేదంటే సరుకును హైజాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుతిరిగిన వారిని మట్టుబెట్టేందుకు సైతం వెనుకాడని రీతిలో అక్రమ రవాణా దందా సాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెల 31వతేదీన ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ముఠాను అరెస్ట్ చేయటంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ఇదే తరహాలో జిల్లాలో రెండు ముఠాలు, ఇతర రాష్ట్రాల్లో మరో రెండు ముఠాలు ఉన్నట్లు నిర్ధారించి, ఆదిశగా పోలీసు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వెలుగొండల్లోని ఎర్రచందనానికి డిమాండ్జిల్లా సరిహద్దులోని వెలుగొండ, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం వృక్షాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో శేషాచలం, వెలుగొండ అటవీ ప్రాంతంలో మినహా మరెక్కడా ఎర్రచందనం లభించకపోవటంతో అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం, వెలుగొండ అటవీ ప్రాంతంలోని రాపూరు, దక్కిలి, కలువాయి, వెంకటగిరి మండలాల సరిహద్దుల్లో ఎర్రచందనం అధికంగా ఉంది. దీంతో స్థానికంగా పదుల సంఖ్యలో స్మగ్లర్లు కొన్నేళ్లుగా ఎర్ర చందనం అక్రమ రవాణా సాగిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఇక్కడికి కూలీలను రప్పించి అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి రహస్య ప్రాంతాల్లో భారీగా డంప్ చేసి స్మగ్లర్లతో లింకులు పెట్టుకుని విక్రయిస్తుంటారు. ఈ వ్యవహారంలో అక్రమ రవాణే కీలకంగా ఉంటుంది. జిల్లా హద్దులు దాటించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తే అక్కడి నుంచి సముద్ర మార్గాన కొన్ని సందర్భాల్లో విమానాల ద్వారా ఇతర దేశాలకు తరలిపోతోంది. ఈ క్రమంలో జిల్లాలో పోలీసులు కూంబింగ్ ప్రక్రియను సీరియస్‌గా నిర్వహించటంతో తొమ్మిది నెలల్లో 57 కేసులు నమోదు చేశారు. కీలక గ్యాంగులను అరెస్ట్ చేశారు. కొంత మేరకు అక్రమ రవాణాను నిర్మూలించగలిగారు. ఈ క్రమంలో జిల్లాతో పాటు సరిహద్దులోని కడప, చిత్తూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో స్మగ్లర్లు రూట్ మార్చి అనంతపురం, బళ్లారి మీదుగా బెంగళూరు రూట్లో అధికంగా అక్రమ రవాణాకు తెరతీశారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా హోస్పేట్ తాలుకాకు చెందిన కొందరు కరుడుగుట్టిన నేరగాళ్లు ముఠాలుగా ఏర్పడి అనంతపురం సరిహద్దుల్లోని బాగేపల్లి నుంచి కర్ణాటక సరిహద్దు హోస్పేట్ వరకు సుమారు 150కి.మీ.లు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ ప్రాంతంలో ఏ వాహనం తిరగాలన్నా, అక్రమ రవాణా చేయాలన్నా వీరికి కప్పం కడితే సరిహద్దులు దాటుతుంది. ఎర్రదుంగలు తరలించే ఈ ముఠాలు టన్నకు రూ.1.50లక్షలు కప్పం చెల్లిస్తే ఎస్కార్ట్‌గా వెళ్లి సరిహద్దులు దాటిస్తారు. అది కూడా పోలీసు యూనిఫాం వేసుకుని ఈ పని చేస్తున్నారు. వారికి డబ్బులు ఇవ్వని వాహనాలను హైజాక్‌చేసి చెన్నై తదితర ప్రాంతాల్లో వాటిని అమ్మి సొమ్ముచేసుకోసాగారు. నెల్లూరులో అరెస్ట్‌తో.. ఎర్రచందనం అక్రమ రవాణా తదితర నేరాలకు పాల్పడే ఆరుగురు సభ్యులున్న ఓ ముఠాను నెల్లూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెల 31వ తేదీన అరెస్ట్ చేయడంతో ఈ అక్రమరవాణా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ తరహా ముఠా కర్ణాటకలో ఒకటి, తమిళనాడులో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా çహోస్పేట్ తాలుకా శివపురం గ్రామానికి చెందిన శివపురం మునియప్ప వెంకటరాజు వికలాంగుడు. ఆయన తన సోదరుడు శివపురం మునియప్పరవి, రామప్ప మంజునాథ, రామప్ప రాజేంద్ర, శివపురం రవి నవీన్‌లు బంధువులు. వీరందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా సంబేరి గ్రామానికి చెందిన రాజేంద్ర బాలాజీతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు చర్యలు చేపట్టారు. కొంతకాలంగా అక్రమరవాణా కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ మూడు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతోన్న స్మగ్లర్ల వివరాలు సేకరించి వారిని సంప్రదించేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో ఎర్రదుంగలను అనంతపురం, హోస్పేట్ మీదుగా బెంగళూరు సరిహద్దులు దాటిస్తామని అందుకు గాను టన్నుకు రూ.1.50లక్షలు కప్పం చెల్లించాలని స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకునేవారు. బెంగళూరుకు వెళ్లాలంటే హోస్పేట్ ప్రధాన మార్గం కావడంతో స్మగ్లర్లు ముఠా చెప్పిన కప్పం చెల్లించేవారు. దీంతో ముఠా సభ్యులు పోలీసుల వలే దుస్తులు ధరించి ఆదునాతన ఆయుధాలు(తుపాకులు)ను చేతబూని ఎర్రచందనం సరిహద్దులు దాటిస్తారు. రెండేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వీరిలో అధిపత్య పోరు రావటంతో విషయం బయటకు వచ్చింది. తొమ్మిది నెలల్లో 57 కేసులు గత తొమ్మిది నెలల్లో టాస్క్‌ఫోర్స్ సభ్యులు 57 కేసులు నమోదు చేసి రూ.20 కోట్ల విలువజేసే 20 టన్నుల ఎర్రచందనం దుంగలను సీజ్‌చేశారు. వీటితో పాటు 69 వాహనాలను, 10 తుపాకులను, 40 అత్యాధునిక ఆయుధాలను సీజ్‌చేసి 929 మందిని అరెస్ట్ చేశారు. గతనెల 31వ తేదీన అరెస్ట్ చేసిన అంతర్రాష్ట్ర ముఠా వద్ద నుంచి రూ.1.50 కోట్లు విలువజేసే ఎర్రదుంగలు, అధునాతన ఆయుధాలు ఎస్బీఎంఎల్ గన్, ఎయిర్‌గన్, ఎఫ్ఎక్స్రాయల్ ఎయిర్‌గన్, 177 నంబర్ ఎయిర్‌ఫిస్టల్, 770 గ్రాముల బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 185 మందితో కూంబింగ్ టీములు ఎర్ర చందనం ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రకియ నిరంతరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 14 బృందాల్లో ఉన్న 185 మంది పోలీసు టీములు కూంబింగ్ ప్రకియ కొనసాగిస్తున్నాయి. జిల్లాలో గతంలో కార్యకలాపాలకు పాల్పడిన ముఠాల కదలికలపైనా నిఘా కొనసాగుతోంది. కర్ణాటక తరహా ముఠాలు కొన్ని ఉన్నాయి. వాటిపై కూడా నిఘా పెట్టాం.–పీహెచ్డీ రామకృష్ణ, ఎస్పీ -
పోలీస్ వేషంలో దర్జాగా
నెల్లూరు(క్రైమ్): పోలీసు దుస్తుల్లో అధునాతన ఆయుధాలను ధరించి ఎర్రచందనాన్ని అనంతపురం మీదుగా బెంగళూరు సరిహద్దులు దాటించడంలో వారు అందెవేసిన చేయి. కప్పం చెల్లిస్తేనే ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించడం, లేదంటే హైజాకింగ్ చేయడం వారి నైజం. ఎదురు తిరిగిన వారిని మట్టుబెట్టేందుకు సైతం వెనుకాడని ఆరుగురు సభ్యులు గల కరుడుగట్టిన అంతర్రాష్ట్ర ఎర్రస్మగ్లర్ల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే ఎర్రదుంగలు, వాహనాలు, అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫెరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ గ్యాంగ్ వివరాలను వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా హోస్కోట తాలుకా శివపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడైన శివపురం మునియప్ప వెంకటరాజు తన సోదరుడు శివపురం మునియప్పరవి, రామప్ప మంజునాథ, రామప్ప రాజేంద్ర, శివపురం రవినవీన్లతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా సంబేరి గ్రామానికి చెందిన రాజేంద్ర బాలాజితో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పూనుకున్నారు. గత కొంతకాలంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో పోలీసు దాడులు అధికమైన నేపథ్యంలో అక్రమ రవాణా కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ మూడు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్ల వివరాలు సేకరించి వారిని సంప్రదించేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో ఎర్రదుంగలను అనంతపురం, హోస్కోట మీదుగా బెంగళూరు సరిహద్దులు దాటిస్తామని, అందుకు గాను టన్నుకు రూ.1.50 లక్షలు కప్పం చెల్లించాలని స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకొనేవారు. బెంగళూరుకు వెళ్లాలంటే హోస్కోట ప్రధాన మార్గం కావడంతో స్మగ్లర్లు ముఠా చెప్పిన కప్పం చెల్లించేవారు. దీంతో ముఠా సభ్యులు పోలీసుల లాగా దుస్తులు ధరించి ఆధునాతన ఆయుధాల(తుపాకులు)ను చేతబూని ఎర్రచందనం సరిహద్దులు దాటిస్తారు. కప్పం చెల్లించని వారి వాహనాలను ముఠా సభ్యులే హైజాక్ చేసి వాటిని చెన్నైకు తరలించి అమ్మి సొమ్ము చేసుకోసాగారు. రెండేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఇటీవల మరో ముఠా ఇదే తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతుండడంతో ఇరు ముఠాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని కాల్పులు సైతం చేసుకున్న క్రమంలో అక్రమ రవాణా, హైజాక్ వ్యవహారం బయటపడింది. ముఠాలో సభ్యుడైన బాలాజి గత కొద్దినెలలుగా తడ మీదుగా చెన్నైకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఈవిషయంపై జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు క్రైం ఓఎస్డీ టీపీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు, వెంకటాచలం, పొదలకూరు, కావలి రూరల్ పోలీసులు నిందితులపై నిఘా ఉంచారు. నిందితుల అరెస్ట్ బుధవారం రాత్రి నిందితులు నెల్లూరు నుంచి ఎర్రదుంగలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వెంకటాచల సత్రం సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ముఠా నాయకుడు శివపురం మునియప్ప వెంకటరాజు, రామప్ప మంజునాథ్, శివపురం రవినవీన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి టయోటా ఫార్చునర్ కారు, ఎస్బీఎంఎల్ గన్, ఫెనివేర్కబు ఎయిర్‌గన్, ఎఫ్ఎక్స్రాయల్ ఎయిర్‌గన్, 10 ఎర్రదుంగలు, 770 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.52,500 నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదే క్రమంలో పొదలకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని డేగపూడి వద్ద రాజేంద్రన్బాలాజీని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి లారీ, 177 కోల్ ఎయిర్‌ఫిస్టల్, 11 కేజీల ఎర్రదుంగలు, రూ.2.500 నగదు, వివో సెల్‌ఫోన్, కావలి ముసునూరు ఫ్లైఓవర్ వద్ద శివపురం మునియప్ప రవి, రామప్ప గజేంద్రలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మహేంద్ర బొలేరో వాహనం, 14 ఎర్రదుంగలు, 30 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2000 నగదు, నోకియా, ఎంఐ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించే క్రమంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు అతికష్టంపై వారిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకొన్న 35 ఎర్రదుంగలు, మూడు వాహనాలు, 8 సెల్ఫోన్లు, 770 గ్రాముల బంగారం విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితులను విచారించగా ఇదే తరహా నేరానికి పాల్పడుతున్న ముఠా వివరాలను వెల్లడించారని, వారి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందని తెలిపారు. వీరితోపాటు వింజమూరు పోలీస్‌స్టేషన్‌లో రెండున్నరేళ్ల క్రితం నమోదైన కేసుల్లో వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కె.సుబ్రమణ్యం అలియాస్ మణి, ఓబులవారిపల్లికి చెందిన కె.కోటేశ్వరరావు అలియాస్ కోటిలను సైతం అరెస్ట్ చేశారు. వీరిపై 20కు పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. దివ్యాంగుడైనా ముఠాను నడపడంలో దిట్ట ముఠానాయకుడు శివపురం మునియప్ప వెంకటరాజు దివ్యాంగుడు. రెండు కాళ్లు పనిచేయవు. వీల్‌చైర్‌లో ఉంటూనే కారు నడపడంలో నేర్పరి. 200 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ ఎన్నోసార్లు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. తన సోదరుడు రవితో కలిసి ముఠా>ను ఏర్పాటు చేసి ఎర్రస్మగ్లింగ్, హైజాక్‌లకు పాల్పడుతూ రూ.కోట్లు ఆర్జించాడు. దివ్యాండైన మునియప్ప ఈ తరహా నేరాలకు పాల్పడుతాడన్న విషయం విస్మయానికి గురిచేస్తోందని ఎస్పీ అన్నారు. నిందితులను అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున ఎర్రదుంగలు, వాహనాలు, అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకొన్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖాజావలి, పొదలకూరు, వెంకటాచలం, కావలి రూరల్ ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. సమావేశంలో ఏఎస్పీ బి.శరత్‌బాబు, క్రైం ఓఎస్డీ టి.పి.విఠలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
దుంగల దొంగలు!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఎర్రచందనం అక్రమార్జన మాకే సొంతం. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోకుడదు.చూసీ చూడనట్లు వెళ్లాలి. అలా అయితేనే పోస్టింగ్‌లో కొనసాగుతారు.’ అచ్చం ఇలాగే తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అధికారం అడుగులకు మడుగులకు ఒత్తేపనిలో కొందరు అధికారులు నిమగ్నమయ్యారు. ఈకోవలోనే 9నెలల కిందట కేసు నమోదైనప్పటికీ జడ్పీటీసీ సోదరుడుని అదుపులోకి తీసుకోలేపోయారు. ఎట్టకేలకు అరెస్టు చేసినపోలీసులు కోర్టుకు హాజరుపర్చి గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌కు పంపిన వైనమిది. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాదెల కేంద్రంగా ఎర్రచందనం అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగింది. ఓబులవారిపల్లె జడ్పీటీసీ నాడుడోరి రమణ సోదరుడు నాయుడోరి శివయ్య దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే తలంపుతో ముందుచూపుతో వ్యవహరించారు. ప్రకృతి సంపద ఎర్రచందనంపై దృష్టి సారించారు. ఆపై అడవులపైబడి విచ్చలవిడిగా విజృంభన చేశారు. ఈక్రమంలో గాదెల గ్రామంలో రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం డంప్ బహిర్గతమైంది. అందుకు ముందు మూడునెలల క్రితం రూ.3కోట్లు విలువైన డంప్ కూడా పట్టుబడింది. ఈమొత్తం స్మగ్లింగ్ దుంగలు నాయుడోరి శివయ్యకు చెందినవిగా అప్పట్లో ఆప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. అయినప్పటీకీ పోలీసులు శివయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం,అరెస్టు చేయడం లాంటి చర్యలు చేపట్టలేదు. క్రైం నెంబర్ 201/2017 కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. పైగా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఎర్రచందనం పట్టుబడ్డ బడా స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరులంటూ ప్రకటనలు గుప్పించడం జారుకోవడం మినహా అసలు స్మగ్లర్లుకు గేట్లు ఎత్తేశారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్.... ఓబులవారిపల్లె జడ్పీటీసీ నాయుడోరి రమణ సోదరుడు శివయ్యను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి నిర్ధారణ తర్వాత కోర్టుకు హాజరుపర్చి రిమాండ్‌కు పంపారు. చిన్నాచితక స్మగ్లర్లను అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలకు పోయే యంత్రాంగం టీడీపీ జడ్పీటీసీ సోదరుడు విషయంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరించడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు వివరిస్తున్నారు. గతంలో గాదెల గ్రామంలో దాదాపు రూ.5కోట్ల విలువైన దుంగల డంప్‌లు లభ్యమయ్యాయి. ఆదే గ్రామానికి చెందిన శివయ్య అరెస్టు నేపథ్యంలో ఆ డంప్‌లు ఎవ్వరివి? ఎక్కడి నుంచి తెచ్చారు? చందనం చెట్టును నరికి డంప్‌లోకి చేర్చిన వారెవరు? ఎంతకాలంగా స్మగ్లింగ్‌తో సంబంధాలున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెలికి తీయకుండా కేసులోని నిందితుడు అరెస్టు చూపెట్టారు. పోలీసు యంత్రాంగం అరెస్టు పెండింగ్‌లో లేకుండా చూసుకోవడం, పెండింగ్‌లో ఉంటే ఉన్నతాధికారుల ప్రశ్నించే అవకాశం ఉడండడంతోనే గుట్టుచప్పుడు కాకుండా నాయుడోరి శివయ్య వ్యవహారంలో కోర్టుకు హాజరుపర్చినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కళంకితులకు బాధ్యతలు..! ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ప్రవేశ పెడుతున్నాం. టాస్క్ఫోర్సు విధులు నిర్వర్తిస్తుందని ఉన్నతాధికారులు ప్రకటించారు.అలాంటి విధుల్లో నీతి, నిజాయితీ ఉన్న అధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తే, అసలు లక్ష్యం సాధించే అవకాశం ఉంది. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులు కళంకితులుగా మిగిలారు. స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకొని అక్రమార్జనకు రుచి మరిగారు. ఈక్రమంలో టాస్క్‌ఫోర్స్ స్థానంలో ‘టాక్స్’ఫోర్స్ అధికారులు వచ్చి చేరారు. అధికారపార్టీ నేతలతో టాక్స్(మాటలు) నిర్వహించడం, ప్రత్యర్థుల్ని కేసుల్లో ఇరికించడం ఒకటైతే, ముడుపులు ముట్టజెప్పినవారిని వదిలేసి చేతులు దులుపుకోవడం మరొక ఎత్తుగా వ్యవహరించారని పలువురు వివరిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ వింగ్‌లో కొత్తగా విధుల్లో చేరిన అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాంటివారు అడువుల్ని రక్షించడమే ధ్యేయంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నార. అలా కాకుండా డక్కీమొక్కీలు తిన్న యంత్రాంగానికి బాధ్యతలు అప్పగిస్తే టాస్క్‌ఫోర్స్ స్థానంలో ‘టాక్స్’ఫోర్స్ ఏర్పడక తప్పదని పలువురు వివరిస్తున్నారు. ఉన్నతాధికారులు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న, ట్రాక్ రికార్డు బాగలేని అధికారుల్ని తప్పించి సచ్ఛీరులకు బాధ్యతలు అప్పగించడం శ్రేయష్కరమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అటవీ ఘోష
శేషాచలం అరణ్యాలు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అంతరించి పోతున్నాయి. ప్రపంచాన్నే తన వైపు చూసేలా పేరొందిన చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో అరుదైన ఎర్రచందనం వనాలు నేడు మైదానాలుగా మారిపోయాయి. దుర్బేధ్యమైన అడవుల్లో విలువైన ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు నరికివేస్తూ జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దులను దాటిస్తున్నారు. ఫలితంగా రూ.కోట్లు విలువైన వన సంపద దొంగల పాలవుతోంది. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. రోజుకో వాహనం, పదుల సంఖ్యలో ఎర్ర కూలీలు పట్టుబడుతున్నా పూర్తి స్థాయిలో నిరోధించడంలో విఫలమవుతున్నారు. భాకరాపేట: అటవీ శాఖలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కూడా ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లోని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతి వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ పరిధిలో చామల, బాలపల్లె అటవీ రేంజ్‌లు ఉన్నాయి. చిత్తూరు జిల్లా చామల, వైఎస్ఆర్ జిల్లా బాలపల్లె రేంజ్లో 28 బీట్లు ఉన్నాయి. ఇందులో ఎర్రచందనం లేని బీట్లు 10 ఉన్నాయి. 18 బీట్లులో ఎర్రచందనం పెద్ద ఎత్తున ఉంది. ఈ ప్రాంతాల్లోకే అత్యధికంగా ఎర్రదండు వెళుతుండడం విశేషం. వీటి పరిధిలో 50 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎవ్వరూ ఈ ప్రాంతంలో పని చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో ఇక్కడ పని చేయడానికి 90 మంది ప్రొటెక్షన్ వాచర్లను తీసుకున్నారు. వీరంతా స్థానికంగానే ఉండేవారు. అయితే వీరి ఎంపికలో అధికారులు అవలంభిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు ఉంన్నాయి. ఇందులో ఎక్కువ మంది స్థానికంగా ఉన్న ఎర్ర స్మగ్లర్లు, నాయకులు పెట్టినవారే ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ వీరి ఎంపికపై అనేక అనుమానాలు లేక పోలేదు. పోలీసులకు పట్టుబడితేనే... ఎర్రచందనం అక్రమ రవాణాలో అటవీ శాఖకు సంబంధించి ఎవ్వరిపైనైనా సరే పోలీసులకు పట్టుబడ్డ తరువాతనే అటవీశాఖ చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. చామల రేంజ్ పరిధిలో మచ్చుకు కొన్ని.. గతేడాది ఫిబ్రవరి నెలలో చామలరేంజ్ పరిధిలోని ఎర్రావారిపాళెం మండలం నెరబైలు సెక్షన్లో ఆరుగురు ప్రొటెక్షన్ వాచర్లు పట్టుబడ్డారు. వీరి నుంచి వాహనాలను, దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో ఎఫ్బీఓ చొక్కలింగంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. అదే ఏడాది భాకరాపేట అటవీ కార్యాలయంలోని గోదాము నుంచి దుంగలు గోడపై నుంచి దాటవేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే మదనపల్లెకు చెందిన ఓ స్మగ్లర్‌ను ప్రొటెక్షన్ వాచర్‌గా పెట్టుకుని అభాసుపాలవ్వడం అందరికి తెలిసిందే.. పోలీసులకు పట్టుబడ్డ తరువాతనే చర్యలు తీసుకోవడంపై అటవీశా ఖ ఉన్నతాధికారులకు అనుమానాలు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. వారే స్మగ్లర్లు.. హైజాకింగ్ ముఠాలు ప్రొటెక్షన్ వాచర్లుగా పనిచేసినవారే ప్రస్తుతం హైజాకింగ్ ముఠాగా అవతారమెత్తి స్థానిక యువతను వారితో కలుపుకుని నాటు తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతూ ఎర్రచందనం తరలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తమిళ స్మగ్లర్లు నుంచి వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి వారి కోసం ప్రత్యేక నిఘా పెట్టింది. అయితే ఆదివారం రాత్రి కళ్యాణిడ్యాం సమీపంలోని పులిబోను వద్ద ఐదుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి స్విఫ్ట్ కారు, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రంగంపేటకు చెందిన ప్రముఖ స్మగ్లర్ సురేష్ ఆధ్వర్యంలోనే ఈ తతంగం నడుస్తుందని తెలుసుకుని మరికొంత మందికోసం గాలింపులు చేపట్టినట్లు సమాచారం. అటవీ శాఖకు ఆయుధాల కొరత అటవీశాఖలో సిబ్బందితో పాటు ఆయుధాల కొరత కూడా తీవ్ర సమస్యగా ఉందని అధికారులు చెబుతున్నారు. తిరుమల అటవీ ప్రాంతంలో ఇద్దరు అటవీశాఖ అధికారులు స్మగ్లర్లు చేతిలో హతమయ్యారు. ఈ సంఘటనతో ఎర్రకూలీలను అడ్డు కోవాలంటే వారికి దీటుగా అత్యాధునిక ఆయుధాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో అమెరికా నుంచి 200 అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అయితే అవి ఢిల్లీ విమానాశ్రయంలో తుప్పు పడుతున్నాయి. ఎర్రచందనం అమ్ముకుని వేల కోట్లు రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకుంది గానీ, కస్టమ్స్ డ్యూటీకి రూ.29 లక్షలు చెల్లించక పోవడంతో అక్కడే ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ తీసుకోక పోవడంతో ప్రభుత్వం తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేదు అటవీశాఖలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదు. చిన్నపాటి ఆరోపణలు వచ్చినా శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. సిబ్బంది కొరత ఉండడం వాస్తవం, ప్రొటెక్షన్ వాచర్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. చిన్నపాటి అనుమానం వచ్చినా వారిని ఒక్క నిమిషం కూడా పనిలో పెట్టుకోం. నెరబైలు ఘటన తరువాత చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – రఘునా«థ్, ఫారెస్టు రేంజర్, భాకరాపేట -
నాటి వాచర్లే..నేటి స్మగ్లర్లు
అటవీ శాఖలో వాచర్లుగా పనిచేసిన ఆ యువకులు స్మగ్లర్లుగా అవతారమెత్తారు. నాటు తుపాకులతో శేషాచలంలో తిరుగుతూ ఎర్ర చందనం చెట్లను నరికే తమిళ స్మగ్లర్లను బెదిరించి వారి దగ్గరున్న ఎర్ర దుంగలను దోచుకెళ్లే హైజాకింగ్ ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా వీరి పని బాగానే ఉంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో ఆర్థికంగానూ ఎదిగారు. మరి కొం తమంది యువకులను చేరదీసి స్మగ్లింగ్ వైపు మళ్లించారు. జల్సాలకు డబ్బులిస్తూ, యువకుల అవసరాలను తీరుస్తూ హైజాకింగ్‌లో ఎదిగారు. ఆరు నెలలుగా దృష్టి పెట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులకు హైజాకింగ్ ముఠా పెద్ద సవాల్‌గా మారింది. ఎన్నిసార్లు వలపన్నినా తప్పించుకు పారిపోతున్నారు. అయితే ఈసారి టాస్క్‌ఫోర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. హైజాకింగ్ ముఠాలోని ఐదుగురు స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ ఉచ్చులో పడ్డారు. నింది తులు చెప్పిన వివరాలు విని టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులే విస్మయానికి గురయ్యారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి నుంచి ఆర్ఎస్ఐ వాసు బృందం కల్యాణి డ్యాం మీద నుంచి పులిబోను మీదుగా కూంబింగ్ జరుపుతోంది. సోమవారం ఉదయం అటవీ మార్గంలో కొందరు స్మగ్లర్ల కదలికలు గుర్తించారు. వారికి కనిపించకుండా వెంట పడ్డ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సరిగ్గా పులిబోను దగ్గర ఐదుగురు స్మగ్లర్లను ఏకకాలంలో చుట్టుముట్టి తుపాకులు గురిపెట్టారు. దీంతో స్మగ్లర్ల కాళ్లకు బ్రేకులు పడ్డాయి. ఐదుగురు నిందితులనూ అదుపులోకి విచారించారు. గతంలో అటవీ శాఖలో ప్రొటెక్షన్ వాచర్లుగా పనిచేసిన కొంత మంది యువకులు ఇప్పుడు స్మగ్లర్లుగా మారారు. రంగంపేటకు చెందిన సురేశ్ వీరికి నాయకత్వం వహిస్తున్నాడు. నాటు తుపాకులను సంపాదించిన సురేశ్ కొంత మంది చురుకైన యువకుల్ని ఎంపిక చేసుకుని హైజాకింగ్ ముఠాను తయారు చేశాడు. ఎర్ర దుంగలు తరలించే తమిళ స్మగ్లర్ల కదలికల్ని ముందే గుర్తించి వారిపై దాడి చేసి వారివద్దనున్న దుంగలను దోచుకోవడం ఈ ముఠా పని. గతంలో ప్రొటెక్షన్ వాచర్లుగా పనిచేసి యువకులకు అడవిలో తిరగడం, స్మగ్లర్ల కదలికల్ని గుర్తించడం సులభం. వాచర్లుగా పనిచేసిన అనుభవాన్ని స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించుకుంటూ సురేశ్ ముఠా పోలీస్‌లకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం ఐదుగురు ముఠా సభ్యుల్ని పట్టుకున్న పోలీసులకు కర్ణాటక రాష్ట్రానికి దుంగలు తరలించేందుకు అడవిలో తిరుగుతున్న సురేశ్ కదలికలు కూడా తెలిశాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల వ్యూహాన్ని ముందే పసిగట్టిన సురేశ్ కారుతో సహా పరారయ్యాడు. టాస్క్‌పోర్సు ఫోలీసులు వెంటనే చిత్తూరు, పలమనేరు, గంగవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసిన విషయాన్ని తెల్సుకుని ఐజీ కాంతారావు, డీఎస్పీ హరినాథబాబు, ఆర్ఐ చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలికి చేరుకుని ఆర్ఎస్ఐ వాసు బృందాన్ని అభినందించారు. పట్టుబడ్డ స్మగ్లర్లు వీరే.. రంగంపేట కేంద్రంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న హైజాకింగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎన్. నాగరాజు, ఎం. చంద్రయ్య, కే. శ్రీనివాసులు సి. ప్రతాప్‌రెడ్డి, వై. ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. మొదటి ఇద్దరిపైనా 2016, 2015ల్లో నాగపట్ల, రంగంపేట పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. పారిపోయిన సురేశ్‌పై మాత్రం చాలా కేసులున్నాయి. -
ఆగని స్మగ్లింగ్..!
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చాపకింద నీరులా జరుగుతూనే ఉంది. అందులో బాలుపల్లి రేంజ్ కీలకంగా మారింది. ఈ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ గత నాలుగేళ్లుగా యథేచ్ఛగా సాగుతోంది. 20 రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ప్రొటెక్షన్ వాచర్లు కూడా పోలీసులకు చిక్కడం గమనార్హం. అడవులపై పూర్తి స్థాయి అవగాహన, ఏ స్మగ్లింగ్‌కు ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి తదితర విషయాలపై పోలీస్, టాస్క్‌ఫోర్స్ అధికారులకంటే వీరికే ఎక్కువ అవగాహన ఉంటుంది. పట్టుబడిన స్మగ్లర్ల వెనుక ఎవరున్నారనే విషయాలపై పూర్తి స్థాయి విచారణ జరపకపోవడం వల్ల స్మగ్లింగ్ నిరాఘాటంగా కొనసాగుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో అటవీశాఖ వైఫల్యం చెందిందనే అభిప్రాయంతో ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని అధికారాలు ఇచ్చి కొంతకాలానికి ప్రత్యేకంగా ఎర్ర చందనం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహిస్తున్నా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదంటే దీనికి కారణం ఇంటి దొంగలేనని చెప్పవచ్చు. ఇటీవల పట్టుబడిన ప్రొటెక్షన్ వాచర్ల ఉదంతమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు కేవలం బాలుపల్లి రేంజ్ పరిధిలోనే 45 కేసులు నమోదు చేసి 11వేల 804 కేజీల బరువు గల 510 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 14 మందిని అరెస్ట్ చేశారు. రెండు రోజులక్రితం కూడా 8 దుంగలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారంటే అడవుల్లో స్మగ్లర్లు ఎంతమంది మకాం వేశారో అర్థమవుతోంది. అటవీశాఖలో పని చేస్తున్న ప్రొటెక్షన్ వాచర్లు స్మగ్లర్లకు సహకరిస్తున్నారంటే ఇలా ఇంటిదొంగలు ఎందరు ఉన్నారో పై అధికారులు తేల్చాల్సి ఉంది. -
పార్థీ గ్యాంగ్ ముసుగులో ఎర్రచందనం రవాణా
రేణిగుంట:రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న పార్థీ గ్యాంగ్ ముసుగులో ఎర్ర స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామానగర్ సమీపంలోని అటవీ ప్రాంతం గుండాలకోన నుంచి ఎర్రచందనం తరలిస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశా రు. ఎర్ర స్మగ్లర్లు పారిపోగా వారు పడవేసిన 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ విజయనరసింహులు కథనం మేరకు.. రోజు వారి తనిఖీల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి ఆర్ఎస్ఐ విజయనరసింహులు, డీఆర్వో శ్రీనివాసరావు, ఎఫ్ఎస్వో నాగరాజు తమ సిబ్బందితో కలిసి తారకరామానగర్, గుండాలకోన వద్ద గస్తీ చేపట్టారు. శ్రీనివాసపురం గ్రామం వద్ద పార్థీ గ్యాంగ్ ఉన్నట్లు అలజడి రేగిందని తెలుకుని గ్రామశివారున ఉన్న మరో టీంకు సమాచారం అందించారు. దుండగులు పార్థీ గ్యాంగ్ సభ్యులు కాదని, ఎర్రచందనం దొంగలని నిర్ధారించుకున్న పోలీసులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకుని వెంబడించారు. దీంతో ఎర్రస్మగ్లర్లు తమ వద్దనున్న దుంగలను పడేసి గుండాల కోన నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. 675 కిలోల బరువున్న 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గత 20 రోజులుగా గ్రామంలో అలజడి ఉన్నందున తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని శ్రీనివాసపురం, తారకరామానగర్ వాసులు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏసీఎఫ్ నాగార్జునరెడ్డి, ఆర్ఐ చంద్రశేఖర్, మురళి, ఎఫ్ఆర్వో ప్రసాద్ పరిశీలించారు. ఆపరేషన్ టీంలో ఆర్ఎస్ఐ విజయనరసింహులు, డీఆర్వో శ్రీనివాసులు, ఎఫ్ఎస్వో నాగరాజురెడ్డి, జగదీష్, నవీన్, మోహన్, రెడ్డెప్ప, ముజీఫ్ పాల్గొన్నారు. -
టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి
చంద్రగిరి: మండలంలోని నరసింగాపు రం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున కూంబింగ్ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై ఎర్ర స్మగ్లర్లు దాడికి దిగారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురు దుండగులు పారిపోయారు. ఆర్ఎస్ఐ భాస్కర్ కథ నం మేరకు.. ఎర్రచందనం చెట్లు నరికేం దుకు స్మగ్లర్లు శేషాచలం అడవిలోకి వెళుతున్నట్టు ఐజీ కాంతారావుకు సమాచా రం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఆర్ఎస్ఐ భాస్కర్ తన బృందంతో కలిసి నరసింగాపురం అటవీ ప్రాంతంలో కూం బింగ్ చేపట్టారు. ఏడుగురు స్మగ్లర్లు నిత్యావసర సరుకులను తీసుకుని అడవిలోకి వెళుతున్నట్టు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిం చారు. నలుగురు అధికారులు మాత్రమే ఉన్నట్టు పసిగట్టిన స్మగ్లర్లు వారి వద్ద ఉ న్న ఆయుధాలతో తిరగబడ్డారు. అధి కారులు చాకచక్యంగా వ్యవహరించి ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని నిత్యా వసర వస్తువులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నారు. తప్పిన ముప్పు పారిపోతున్న కూలీలను పట్టుకునేం దుకు అధికారులు వారిని వెంబడించా రు. ఆ ప్రాంతంలో మూడు అడుగుల ఎత్తులో విద్యుత్ తీగలు ఉండడాన్ని గమనించి ఆగిపోయారు. దీంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. తీగలను గుర్తించకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికా రులు తెలిపారు. అధికారులపై కూలీలు దాడికి దిగినట్లు తెలుసుకున్న ఐజీ కాంతారావు అక్కడికి చేరుకుని సమీక్షిం చారు. ఐజీ మాట్లాడుతూ చీకట్లో విద్యుత్ తీగలకు తగిలి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. అనంతరం సిబ్బందిని ఆయన అభినందించారు. తనకు ముగ్గురు ఆడపిల్లలని నిందితుడు సేలం జిల్లాకు చెందిన ఆండి తెలిపాడు. తనకు డబ్బు ఆశను చూపి ఇక్కడికి తీసుకొచ్చి నట్లు పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హరినాథ్ బాబు, ఎఫ్ఆర్ఓలు ప్రసాద్, లక్ష్మీపతి, ఎసిఎఫ్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. వాహనం సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం తిరుపతి మంగళం : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి స్ట్రైకింగ్ ఫోర్సు అధికారులు తెలపారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) జగదీష్ చంద్రప్రసాద్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజామున స్ట్రైకింగ్‌ఫోర్సు అధికారులు రేణిగుంట–పుత్తూరు హైవే గాజులమండ్యం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న మారుతీ జెన్ కారును ఆపారు. వాహనంలోని స్మగ్లర్లు పోలీసులను గమనించి పారిపోయారు. కారులో పరిశీలించగా 8 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. కారుతో సహా దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. వాటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎఫ్‌బీవో ఎం.మూనియానాయక్, స్ట్రైకింగ్ ఫోర్సు సిబ్బంది మురళి, పి.మూర్తి, జేసీ నారాయణ, నరసింహులు, శంకర్‌నాయక్ పాల్గొన్నారు. -
దుంగల దొంగల దారి
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఎర్రచందనం దుంగలను అక్రమార్కులు తరలిస్తుండగా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. పెనుకొండ , సోమందేపల్లి పోలీసులు ఏకకాలంలో దాడులకు దిగడంతో దిక్కు తెలియని స్మగ్లర్లు వాహనాలను సోమందేపల్లి పట్టణంలో పార్కింగ్‌లో కార్ల ఉంచినట్లు పోలీసులను నమ్మించి తప్పించుకునే యత్నం చేశారు. అయితే పోలీసుల అప్రమత్తతతో ఎర్రచందనం రవాణా గుట్టురట్టైంది. ఇలాగే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు మస్కాకొట్టి స్మగ్లర్లు దుంగలను దర్జాగా రాష్ట్రం దాటించేస్తున్నారు. పెనుకొండ: ఎర్ర చందనం అక్రమ రవాణాకు 44వ జాతీయ రహదారి అడ్డాగా మారింది. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా... అటవీశాఖ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా ఎర్రచందనం అడ్డదారుల్లో ఇష్టారాజ్యంగా తరలుతోందన్న విమర్శలున్నాయి. చుట్టపుచూపుగా కొందరు అటవీ సిబ్బంది విధులకు వస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. గతంలో ఏకంగా అటవీశాఖ కార్యాలయంలోనే నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను రాత్రికి రాత్రే అపహరించుకు వెళ్ళినా అధికారులు ఏమీ చేయలేకపోయారు. విపరీతమైన డిమాండ్ మార్కెట్లో ఎర్రచందనానికి విపరీతమైన గిరాకీ ఉండటం వల్లే స్మగ్లర్లు, వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఎర్రచందనంతో మందుల తయారీ, బొమ్మల తయారీ, ఆయుర్వేదిక్ ఔషధాల తయారీలో అధికంగా ఉపయోగిస్తారు. మనదేశంతో పాటు విదేశాల్లో సైతం అధిక డిమాండ్ వుంది. ప్రభుత్వ ధరల ప్రకారమే ఏ గ్రేడ్ కిలో ఎర్రచందనం రూ.2,750 , బీ గ్రేడ్ రూ.1650 నిర్ణయించారు. అయితే బహిరంగ మార్కెట్లో కిలో దాదాపుగా ఏ గ్రేడ్ ఎర్రచందనం రూ. 4000 పైనే పలుకుతోందని తెలుస్తోంది. దీంతో తమ పథకం పారితే ఒకే రోజులో కోటీశ్వరులు కావచ్చన్న అత్యాశతో వ్యాపారులు ఈ అక్రమ రవాణాను ముమ్మరం చేశారు. తమిళులతో వ్యాపారుల సంబంధాలు మన రాష్ట్రంలోని పలువురు ఎర్రచందనం వ్యాపారులు తమిళ స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని బెంగళూరు కేంద్రంగా దుంగలను తరలిస్తున్నట్లు సమాచారం. కడప జిల్లాలోని అటవీప్రాంతంలో ప్రాంతంలో చెట్లను నరకి జాతీయ రహదారి మీదుగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కొందరు అధికారులే చెబుతున్నారు. పెనుకొండ పరిధిలో మచ్చుకుకొని కేసులు.. ♦ అక్టోబర్ 5, 2011లో 343 దుంగలతో పాటు లారీ, స్కార్పియోను సీజ్ చేసి 19 మందిని అరెస్టు చేశారు. ♦ 2011 నవంబర్ 19న హరిపురం వద్ద 173 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసు నమోదు చేసి కారు, టాటా సుమో, ఈచర్ను సీజ్ చేశారు. ♦ 2014 ఫిబ్రవరి 28న 32 దుంగలను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. ఈచర్ వ్యాన్‌ను సీజ్ చేశారు. ♦ 2015 ఆగస్టు 15న దుద్దేబండ క్రాస్ వద్ద 40 దుంగలను పట్టుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లను రేంజ్కార్యాలయానికి తరలించారు. ♦ అక్టోబర్ 18, 2017లో 18 దుంగలను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. ♦ ఈనెల 2న సోమందేపల్లి పోలీసులు 2 ఎక్స్‌యూవీ ఖరీదైన కార్లలో తరలిస్తున్న 43 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ♦ అటవీశాఖ, గోరంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. కోట్ల రూపాయల విలువజేసే ఎర్రచందనం రాష్ట్రం దాటుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్రలోనే ఉన్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. సిబ్బంది కొరత ఉంది అటవీ శాఖ సిబ్బంది కొరత ఉంది. తగిన వాహనాలు కాని, ఇతరత్రా సౌకర్యాలు లేవు. సమస్య తీవ్రత ఉన్నతాధికారులకు కూడా తెలుసు. ఇటీవల బాధ్యతలు తీసుకున్నా. ఎన్ని కేçసులు ఉన్న విషయం కూడా తెలీదు. ఎర్రచందనం రవాణాకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటాం.– రవిశేఖర్, రేంజర్, పెనుకొండ -
త్వరలో ఎర్ర స్మగ్లర్ల ఆస్తుల జప్తు
ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్మగ్లర్లను అరెస్టు చేయడం, వారిని జైలుకు పంపడంతో పాటు వారి అక్రమ ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అటవీ శాఖ అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పించనుంది. 2016లో వచ్చిన అటవీ శాఖ అమెండమెంట్ యాక్టు ప్రకారం ఎర్ర చందనం స్మగ్లర్లు కూడబెట్టిన అక్రమ ఆస్తులను జప్తు చేసేందుకు సమాయత్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : శేషాచలంలో ఉన్న అపారమైన వృక్ష సంపదలో ఎర్రచందనం ఒకటి. ఇప్పటికి 20 ఏళ్లుగా ఎర్ర చంద నం చెట్లను నరికి స్మగ్లర్లు సొ మ్ము చేసుకుంటున్నారు. చిత్తూ రు, కడప, కర్నూలు, ప్రకాశం జి ల్లాల్లో 70 లక్షల ఎర్ర చందనం చెట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. వీటి విలువ కోట్లలోనే. ఇదిలా ఉండగా నిత్యం శేషాచలంలోకి చొరబడుతున్న ఎర్ర స్మగ్లర్లను నిలువరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. ఎర్రచందనం పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్, అటవీ, పోలీస్ శాఖలు విస్తృతంగా అడవుల్లో కూంబింగ్ జరిపి రోజూ స్మగ్లర్లను అరెస్టు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు. స్మగ్లర్ల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. స్మగ్లింగ్ ఆగనూ లేదు. ఈ క్రమంలో స్మగ్లర్లపై మరింత ఉక్కుపాదం మోపేందుకు సర్కారు ఆస్తుల జప్తును తెరమీదకు తెస్తోంది. ఇప్పటివరకూ ఎంతమంది స్మగ్లర్లు అరెస్టయ్యారు. వారికున్న ఆస్తుల విలువ ఎంత, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో గుర్తించేందుకు సిద్ధమైంది. అటవీ, పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి వివిధ జిల్లాల్లో ఉన్న స్మగ్లర్ల వివరాలను సేకరిస్తోంది. ఎర్రచందనం కేసుల్లో అరెస్టయిన వారి ఆస్తుల విలువను అంచనా వేసేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయనుంది. ఆస్తుల జప్తునకు సంబం ధించిన కేసుల విచారణాధికారులుగా డీఎస్పీలను నియమించనున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలో ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనుంది. తొలి జాబితాలో వంద మందికి పైనే... ఆస్తుల జప్తునకు ఉపక్రమించే ముందు ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్ల జాబితాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ జిల్లాల్లో చార్జిషీట్ ఫైల్ అయిన స్మగ్లర్ల వివరాలను సేకరించి ప్రభుత్వం తొలి జాబితా విడుదల చేయనుంది. సుమారు వంద మందికి పైగా వీరుంటారని సమాచారం. కేవలం అక్రమ ఆస్తులను మాత్రమే జప్తు చేసే వీలుందని అధికారులు అంటున్నారు. ఈ విషయం తెలిసి స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరుగె డుతున్నాయి. -
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
-
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : ఢిల్లీ, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన నలుగురిని ప్రొద్దుటూరు రూరల్, చాపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 250 కిలోల 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. రూరల్ సీఐ ఓబులేసు, ఎస్ఐలు చంద్రశేఖర్, చాపాడు ఎస్ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలసి మంగళవారం మైదుకూరు రోడ్డులోని మీనాపురం క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో మైదుకూరు వైపు నుంచి వస్తున్న స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే స్మగ్లర్లు వాహనం ఆపకుండా పోలీసులను గుద్ది చంపే ప్రయత్నం చేశారు. తర్వాత వాహనాన్ని పోలీసులు వెంబడించగా రాళ్లు, కట్టెలతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో చుట్టుముట్టిన పోలీసులు అనంతరపురం జిల్లా, నార్పల మండలం, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ తిరుపాలరెడ్డి, కమలాపురం మండలం, కొండాయపల్లి గ్రామానికి చెందిన చెప్పలి గంగాధర్, బి.మఠం మండలం, రేకులకుంట గ్రామానికి చెందిన పెద్దపోతు వెంకటస్వామిలను అరెస్ట్ చేశారు. స్కార్పియోలో ఉన్న 102 కిలోలు కలిగిన 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాపాడు స్టేషన్ పరిధిలోని అల్లాడుపల్లె క్రాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశారు. మైదుకూరు వైపు నుంచి వస్తున్న కారును ఆపగా అందులో ఉన్న చాపాడు మండలం, ఖాదర్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ సింపతి ఫకృద్ధీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ఉన్న 148 కిలోల 8 చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరికి తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఏపీలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్ఐలు, సిబ్బందికి డీఎస్పీ ప్రశంసలు ప్రాణాలకు తెగించి ధైర్యసాహసాలతో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన సీఐ ఓబులేసు, ఎస్ఐలు చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఏఎస్ఐలు అహ్మద్, నారాయణ, కానిస్టేబుళ్లు మధుసూదన్‌రెడ్డి, సుబ్బయ్య, లక్ష్మీపతిరెడ్డి, శంకర్, కమాల్‌బాషా, ఖాదర్, వెంకటసుబ్బయ్యలను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేస్తానని డీఎస్పీ పేర్కొన్నారు. -
ఉపాధి పేరిట గాలం
పేదల అమాయకత్వం, పేదరికాన్ని కొందరు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఉపాధి కల్పిస్తామని నమ్మబలుకుతున్నారు. వారికి ముందుగా కొంత నగదు ఇస్తున్నారు. ఎర్రచందనం దంగలను నరికేందుకు శేషాచలం అడవుల్లోకి తరలిస్తున్నారు. అసలు విషయం తెలుసుకున్న పేదలు డబ్బు తిరిగి చెల్లించి వెనక్కి వెళ్లలేక మనసు చంపుకుని అడవుల్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా సరిహద్దు తమిళనాడులోని పలు గ్రామాల నుంచి శేషాచలం అడవుల్లోకిళ్లే కూలీల సంఖ్య పెరుగుతూనే ఉంది. పలమనేరు : జిల్లాకు ఆనుకుని ఉన్న వేలూరు, గుడియాత్తం, పేర్నంబట్, క్రిష్ణగిరి, కావేరిపట్నం, ధర్మపురి ప్రాంతాల్లోని అటవీ సమీప ప్రాంత వాసులతోపాటు పలమనేరు, కుప్పం నియోజకవర్గంలోని మండిపేట కోటూరు, చెత్తపెంట, కాలువపల్లె, యానాదికాలనీ, సెంటర్, నెల్లిపట్ల, బాపలనత్తం, వెంగంవారిపల్లె, కొత్తిండ్లు, కేసీ పెంట, గాంధీనగర్, జగమర్ల, దేవళం పెంటతో పాటు పెద్దపంజాణి, వీకోట, కుప్పం నియోజకవర్గంలోని మండలాల్లోని అటవీ సమీప గ్రామాల ప్రజలు గతంలో అడవుల్లో దొరికే ఉత్పత్తులను సేకరించి పొట్టపోసుకునేవారు. మరికొందరు అడవుల్లో పశువులను మేపుకునేవారు. ఇంకొందరు ఉపాధి పనులకు వెళ్లేవారు. కొంతకాలంగా వీరికి ఉపాధి కరువైంది. కుటుంబాలు గడవడం కష్టం మారింది. వీరి ఆకలిని ఆసరాగా తీసుకున్న ఎర్రచందనం ముఠాలు గాలం వేస్తున్నాయి. ముందుగానే అడ్వాన్సులు చిత్తూరు జిల్లాలో వెంచర్ల నిర్మాణం, కేబుల్ కొట్టే పనులు, చెట్లను కొయ్యడం లాంటి పనులు ఉన్నాయని కూలీలను నమ్మిస్తున్నారు. యువకులను ఎంపిక చేసుకుంటున్నారు. గ్రామంలోని పెద్దమనిషి ముందు వారికి బయానాగా రూ.పది వేల దాకా నగదు ఇస్తున్నారు. తాము చెప్పినప్పుడు పనికిరావాలని పేర్కొంటున్నారు. కష్టాల సమయంలో వచ్చిన డబ్బును వారు ఖర్చు పెట్టేస్తారు. దీంతో చేసేది లేక ఏజెంట్లు పంపిన చోట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతాలకు చెందిన పదుల సంఖ్యలో కూలీలు కొన్నేళ్లుగా ఇళ్లకు రాకుండా పోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యక్తులు అదృశ్యమైనా వారి కుటుంబ సభ్యులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. కొండకెళ్లే భక్తుల్లా జిల్లాలోకి ఈ కూలీలు తిరుమలకు వెళ్లే భక్తుల్లా లగేజీతో బస్సుల్లో జిల్లాలోకి అడుగు పెడుతున్నారు. ఇంకొందరు కాలినడకన తిరుమలకని వస్తున్నారు. క్రిష్ణగిరి వైపు నుంచి వచ్చేవారు పుంగనూరు సమీపంలోని బోయకొండకు వచ్చి అక్కడి నుంచి పీలేరు మీదుగా భాకరాపేట అడవుల్లోకి చేరుతున్నారు. ఊబిలోకి దిగితే ఇక అంతే అనుకోని విధంగా ఎర్రచందనం చెట్లను కొట్టేందుకు వెళ్లిన కూలీలు మళ్లీ ఇతర పనులకు వెళ్లడం లేదు. గ్రామాల్లో తిరిగితే పోలీసులు పట్టుకుంటారని బెదిరించి ఈ కూపంలోనే కొనసాగేలా చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. దీనికి తోడు కూలీలకు రోజుకు రూ.500 కూలీతో పాటు ఆహారం, మద్యం సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. తొలుత పనులకు వెళ్లిన వారు నెలల వ్యవధిలోనే వేలల్లో డబ్బు సంపాదించడం, టీవీలు, ఫ్రిజ్‌లను కొనుగోలు చేయడాన్ని చూసిన మరికొందరు కూలీలు సైతం వీరి బాట పడుతున్నారు. ఈ కూలీల్లో బాగా చదువుకున్న వారు కూడా ఉండడం గమనార్హం. కూలీల కోసం ప్రత్యేక ఏజెంట్లు శేషాచలం అడవుల్లోకి కూలీలను సరఫరా చేసేందుకు జిల్లాకు చెందిన పలువురు ఏజెంట్లు పనిచేస్తున్నట్టు సమాచారం. వీరి ద్వారానే కూలీలు అడవుల్లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. స్మగ్లర్లకు కావాల్సిన పనిముట్లు, లగేజీ ఆటోలు, దుంగలను తరలించేందుకు తప్పుడు ఆర్సీలున్న వాహనాలను ఈ ఏజెంట్లే సమకూర్చుతున్నట్టు గతంలో పోలీసుల విచారణలో తేలింది. ఈ ఎర్రకూలీల వ్యవహారాన్ని గుట్టురట్టు చేయాలంటే కీలకమైన ఏజెంట్లను పట్టుకోవాల్సిన అవరసం ఉంది. నిర్లక్ష్యం చేస్తే మరెంతమందో ఈ ఊబిలో ప్రాణాలను పోగొట్టుకోవడం లేదా జైళ్లలో మగ్గక తప్పదు. -
ఎర్రస్మగ్లర్లపై మెరుపు దాడి
కావలిరూరల్/సంగం/దుత్తలూరు: జిల్లాలో ఆత్మకూరు, దుత్తలూరు పరి ధిలో అటవీ ప్రాంతంపై అటవీశాఖ, పోలీసులు నిఘా ఉంచి సోమవారం తెల్లవారుజామున ఏకకాలంలో ఎర్రస్మగ్లర్లపై మెరుపు దాడులు నిర్వహించారు. సుమారు రూ.70 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కావలి, సంగం, దుత్తలూరు ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న 27 మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. కావలి సమీపంలోని ముసుసూరు వద్ద జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు వాహనాల్లో తరలిస్తున్న 10 దుంగలతోపాటు 10 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. దుంగలు తరలిస్తున్న రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంగం చెక్‌పోస్టు వద్ద సోమవారం తెల్లవారుజామున ఎస్సై వేణు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దుంగలు తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు వైపు నుంచి నెల్లూరు– ముంబాయి జాతీయ రహదారిపై ఓ ఇన్నోవా వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి సంగం పోలీసులకు సమాచారం అందడంతో ఎస్సై వేణు తన సిబ్బందితో చెక్‌పోస్టు వద్ద మాటు వేసి ఇన్నోవా వాహనాన్ని నిలిపి తనిఖీలు చేపట్టారు. అందులో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన ఏడుగురు కూలీలతో పాటు నెల్లూరుకు చెందిన వ్యాపారి వెంకటేశ్వర్లు, ఇన్నోవా డ్రైవర్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. దుత్తలూరు అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారంతో ఎస్సై ఎం.వెంకటరాజేష్ సోమవారం తెల్లవారుజామున నందిపాడు కస్తూర్బా పాఠశాల సమీపంలో పోలీసు నిఘా ఉంచగా ఓ కారును తనిఖీ చేయగా, అందులో 18 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న 8 మంది కూలీలను, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. గతేడాది34 కేసులు నమోదు ఎర్రచందనం స్మగ్లర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు స్మగ్లర్ల ఆస్తులు సీజ్ చేస్తామని జిల్లా క్రైమ్ ఓఎస్డీ విఠలేశ్వర్ తెలిపారు. సోమవారం కావలి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది 34 కేసులు నమోదు చేసి 590 మందిని అరెస్టు చేసి, 45 వాహనాలను సీజ్ చేశామన్నారు. మొత్తం రూ.16 కోట్ల విలువైన 16.32 టన్నుల ఎర్రచందనం దుంగలు, రూ.62,250 నగదు, రెండు ఎస్బీబీఎల్, 25 రివాల్వర్లను సీజ్ చేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటి 14 కేసుల నమోదు చేసి 81 మందిని అరెస్ట్ చేసి 67 టన్నుల దుంగలు, 13 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లర్ల జాబితా తయారు చేసి వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. సమీపంలో ఎక్కడైనా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నా, లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే జిల్లా పోలీస్ వాట్సాప్ నంబరు 93907 77727కు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలను కోరారు. -
విజయనగరంలో ఆపరేషన్ రెడ్
చిత్తూరు అర్బన్ : ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరి కట్టడానికి చిత్తూరు పోలీసు జిల్లాలో ఏర్పాటైన ఆపరేషన్ రెడ్ విభాగం విజయనగరంలో ఓ భారీ డంప్‌ను స్వాధీనం చేసుకుంది. రూ.కోట్లు విలువజేసే ఎర్రచందనం డంప్‌ను విజయనగరం జిల్లాలో గుర్తించిన చిత్తూరు పోలీసులు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని వెనుక ఉన్న ఓ బడా స్మగ్లర్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. పూతలపట్టు సమీపంలో మూడు రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ మినీలారీలో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధిం చి నిందితులను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో విజయనగరం జిల్లాకు చెందిన ఓ బడా వ్యక్తి పేరు బయటపెట్టారు. ఈ విషయంపై ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని .. ఓ ప్రత్యేక బృందాన్ని విజయనగరం పంపుతూ చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. పూతలపట్టులో పట్టుబడ్డ చోటా స్మగ్లర్‌ను వెంటపెట్టుకుని మంగళవారం తెల్లవారుజామున చిత్తూరు పోలీసులు విజయనగరం చేరుకున్నారు. అక్క డ భారీగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగల డంప్‌ను గుర్తించారు. టన్ను రూ.35 లక్షల వరకు పలికే ఏ–గ్రేడ్ ఎర్రచందనం దుంగలు డంప్‌లో ఉన్నట్లు సమాచారం. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.5 కోట్లకుపైగా ఉండొచ్చని సమాచారం. కాగా దుంగలు పట్టుబడ్డ డంప్ ప్రాంతంలో ముగ్గురిని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎర్రచంద నం దుంగలు దొరికిన స్థల యజమా నితో పాటు మరో ఇద్దరు స్మగ్లర్లు ఉన్నారు. అయితేఅనూహ్యంగా వీరి వెనుక ఓ అంతర్జాతీయ బడా స్మగ్లర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించా రు. అతడిని పట్టుకోవడానికి విజయనగరం పోలీసులతో కలిసి చిత్తూరు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడున్న అన్ని ప్రధాన చెక్పోస్టులపై నిఘా ఉంచారు. మరో రెండు రోజుల పాటు అక్కడే ఉండి పట్టుబడ్డ డంప్‌తో పాటు నిందితులను చిత్తూరుకు తీసుకురానున్నారు. శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం భాకరాపేట /తిరుపతి మంగళం : శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్ రఘునాథ్ తెలిపారు. మంగళవారం భాకరాపేటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ శేషాచలం అడవుల్లో అటవీ అధికారులు, సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లు, పైర్ వాచర్లు కలసి నాలుగు రోజులుగా కూంబింగ్ చేస్తున్నారని, సోమవారం పెరుమాళ్లపల్లె బీట్ పరిధిలోని మేకలబండ ప్రాంతంలో ఎదురుపడ్డ తమిళ స్మగ్లర్లను చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలు పడేసి పరారయ్యారని తెలిపారు. అక్కడ 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే మంగళవారం 50 దుంగలు ఉన్న డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
వాహనం ఇక్కడ.. నిందితులెక్కడ?
జమ్మలమడుగు: ఎర్రచందనం దుంగలను తరలిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ వాహనం ఎవరిది.. అందులో ప్రయాణిస్తున్న వారు ఎవ్వరు అనే విషయం ఇంతవరకు తేలలేదు. స్థానిక తాడిపత్రి బైపాస్ రోడ్డులో రెండు నెలల క్రితం ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం పంక్చర్ కావడంతో ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వారు గాయపడినట్లు అక్కడున్న రక్తపు మరకలను బట్టి స్పష్టమైంది. పోలీసులొస్తే దొరికిపోతామనే భయంతో వారు ఎలాగోలా తప్పుకున్నారు. కానీ అందులో ఉన్న ఎర్రచందనం దుంగలను అలాగే వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి తాము ఫారెస్టు అధికారులమంటూ దర్జాగా అందులో ఉన్న దుంగలను వారి వాహనంలో వేసుకుని ఉడాయించారు. అయితే అందులో ఉన్న ఓ మొబైల్ ఫోన్‌ను అక్కడే వదిలేసి వెళ్లడంతో దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ ఫోన్లో ఉన్న నెంబర్లను పరిశీలించిన పోలీసులు అవి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులవిగా గుర్తించినట్లు సమాచారం. ఆ నెంబర్ల ఆధారంగా ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కడప, కోడూరు, బద్వేలు, మైదుకూరు తదితర ప్రాంతాల్లో పోలీసు నిఘా పెరగడంతో స్మగ్లర్లు రూటు మార్చి జమ్మలమడుగు మీదుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తమ అదుపులో ఉన్న వాహనం, ఫోన్ నెంబర్ల ఆధారంగా సూత్రధారులను గుర్తించి ఎర్రచందనం అక్రమాలకు కళ్లెం వేయాలని పలువురు కోరుతున్నారు. -
అక్రమ రూటు!
నంద్యాల : తిరుపతి ఆర్టీసీ అధికారులు పట్టీపట్టన ట్లు వ్యవహరించడం.. ఎర్రచందనం స్మగ్లర్ల ఉచ్చులో చిక్కి, కూలీలను తరలిస్తున్న డ్రైవర్లకు బాగా కలిసొచ్చింది. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోల బస్సులు ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల సమయంలో చెన్నై నుంచి బయల్దేరుతాయి. మార్గమధ్యలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుృతి బస్టాండ్‌కు చేరుకోవాలి. అయితే తిరుపతి బస్టాండ్‌లోకి వెళ్లకుండా ఈ బస్సుృ డ్రైవర్లు రేణిగుంట మీదుగా నేరుగా రాజంపేటకు వెళ్తున్నారు. ఏడాది కాలం నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోకి చెన్నై నుంచి రావాల్సిన నంద్యాల, ఆళ్లగడ్డ బస్సులు రాకపోయినా.. చార్టులో డ్రైవర్లు సంతకాలు చేయకపోయినా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్టీఐలు పట్టించుకోలేదు. ఎందుకు రావడంలేదో కనీసం ఆరా కూడా తీయలేదు. దీంతో డ్రైవర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఆర్టీసీ నిబంధనల మేరకు చెన్నై నుంచి నంద్యాలకు వచ్చే మార్గంలో తిరుపతి బస్టాండ్‌లోని చార్టులో వారు సంతకం చేయాల్సి ఉంది. అయితే ృక్క రోజు కూడా చార్టులో సంతకం చేయకపోవడంతో ఆర్టీసీ అధికారులకు అనుమానం రాకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాక ఈ బస్సులకు తిరుపతిలో గాని, చెన్నైలో గాని రిజర్వేషన్ సౌకర్యం కూడా లేదు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వారే బస్సులో టిమ్ టికెట్లను ఇస్తారు. ఇది ఒక రకంగా డ్రైవర్లకు ఉపయోగపడిందని ఆర్టీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం తిరుపతి రీజనల్ మేనేజర్ సంబంధిత రికార్డులను తెప్పించుకొని డ్రైవర్లు సంతకాలు చేస్తున్నారా.. లేదా అనే విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే. ఈ అప్రమత్తత ముందుగా ఉంటే డ్రైవర్ల అక్రమాలకు ముకుతాడు పడేది. కానీ బాధ్యులైన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారి అక్రమాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఉచ్చులో మరి కొంత మంది డ్రైవర్లు? ఎర్రచందనం స్మగ్లర్లకు సహకారం అందించి పట్టుబడిన వారు తక్కువేనని.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకే కాక ఇతర డిపోలకు చెందిన డ్రైవర్లకు కూడా సంబంధాలు ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడిన నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన డ్రైవర్లను రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. ఈ విచారణలో చెన్నైకి వెళ్లే ఇతర డిపోలకు చెందిన డ్రైవర్లు కూడా కూలీలకు సహకారం ఇస్తూ వచ్చారని వివరించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి రావడానికి కీలక పాత్ర పోషించిన నంద్యాల డిపోకు చెందిన సయ్యద్ అక్బర్‌హుసేన్ ద్వారా సీమ జిల్లాలకు చెందిన బస్సుల డ్రైవర్లు కూడా సహకారం అందించారని వివరించినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ నిన్న పట్టుబడిన డ్రైవర్ల సంఖ్య స్వల్పమేనని వీరి బాటలోనే మరికొన్ని డిపోలకు చెందిన డ్రైవర్లు ఉన్నారని వారి కోసం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. వీరిలో అప్పుడే కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. నల్లమల బస్సు సర్వీసులపై నిఘా.. ఎర్రచందనం స్మగ్లర్లతో కడప, చిత్తూరు, చెన్నై ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధాలు ఉన్నాయని తేలడంతో నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లే ఆర్టీసీ బస్సులపై కూడా పోలీసులు, అటవీ శాఖ అధికారులు నిఘాను పెంచారు. మంగళవారం కడప ఎస్పీ నవీన్‌గులాటి ఆధ్వర్యంలో విచారణ జరిపి రాజంపేట, కుక్కలదొడ్డి, తదితర ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం వచ్చే కూలీలకు నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు సహకారం ఇస్తున్న విషయం రూడీ కావడంతో నల్లమలకు బస్సులు నడుపుతున్న ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన బస్సులపై బుధవారం నుంచి నిఘాను పెంచారు. మరోసారి డొల్లతనం బయట పడకుండా... ఏడాది కాలం నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లు చెన్నై సర్వీసులకు వెళ్తూ అక్రమాలకు పాల్పడుతున్నా అటు స్క్వాడ్లు కాని, ఇటు వారి రికార్డులను పరిశీలించే అధికారులు కాని పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధమైన 11 మంది డ్రైవర్లతో పాటు వారి టికెట్ల రికార్డులను స్టేజీలను పరిశీలించే అధికారులపై కూడా చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజంపేట కోర్టులో హాజరు.. కడపలో పట్టుబడిన 11 మంది ఆర్టీసీ డ్రైవర్లను బుధవారం రాజంపేట జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరచగా వారికి ఈనెల 16వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వారిని వెంటనే రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. -
పిడికిలి
కడప అర్బన్ : జిల్లాలో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్లుగా చలామణి అవుతున్న ముగ్గురిని ఎస్పీ జీవీజీ అశోకకుమార్ ఆదేశాల మేరకు రాజంపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరిపై పీడీ యాక్ట్ కేసు పెట్టారు. వారి వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని రైల్వేకోడూరుకు చెందిన దేవులపల్లి రాజశేఖర్ అలియాస్ చిన్నాను అరెస్టు చేశామన్నారు. ఇతను 2009లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ప్రారంభించి ఇప్పటివరకు 18 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి ఇతను ముఖ్య అనుచరుడన్నారు.అలాగే మైదుకూరు మండలం దువ్వూరుకు చెందిన నాగినేని శివ 2007 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పరారీలో ఉన్నాడన్నారు. ఇతను 21 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. వేంపల్లె మండలం నందిపల్లెకు చెందిన వీరం లింగేశ్వరరెడ్డి అలియాస్ వీరుడు నాలుగేళ్ల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడన్నారు. ఇతను ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. వీరందరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నామన్నారు. -
తమిళనాడు టు కడప..
కడప అర్బన్: ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ వ్యూహం రచిస్తుండటంతో స్మగ్లర్లు రూటు మార్చారు. జిల్లాలోని శేషాచలం అడవుల్లోకి చేరుకునేందుకు వీరు పాత మార్గాన్ని వదిలేసి కొత్త మార్గం ఎంచుకున్నారు. గతంలో వీరు చెన్నై నుంచి తిరుపతి, రేణిగుంట, రైల్వేకోడూరు, రాజంపేట, కడప ప్రాంతాలకు ప్యాసింజర్, వెంకటాద్రి, రాయలసీమ, ఎగ్మోర్ రైళ్ల ద్వారా వచ్చేవారు. రైల్వేస్టేషన్లలో పోలీసు నిఘా పెరగడంతో చాలామంది ఎర్రచందనం కూలీలు అరెస్టై చిత్తూరు, కడప, నెల్లూరు కారాగారాల్లో ఉన్నారు. పోలీసు, అటవీ శాఖ సిబ్బంది దృష్టి తమపై ఉం దని భావించిన ఎర్రచందనం కూలీలు ప్రస్తుతం తమిళనాడు నుంచి బెంగళూరు వెళ్లి అక్కడినుంచి గుంతకల్లు మీదుగా కడపకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలోకి నడుచుకుంటూ లేదా వాహనాల్లో వెళుతున్నారు. కడప రిమ్స్ పరిసర ప్రాంతాల నుంచి వీరు అడవుల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి ఆయా ప్రదేశాలకు చేరుకుంటున్నట్లు సమాచారం. కూలీలకు స్థానిక స్మగ్లర్లు భోజనం వండుకునేందుకు అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తున్నారు. కడప అటవీ రేంజ్ పరిధిలోని రిమ్స్ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు ఇటీవల వాటర్ ప్యాకెట్లను అడవిలోకి తీసుకెళ్తూ అటవీ సిబ్బందికి తారసపడ్డారు. అటవీ సిబ్బంది వారిని ప్రశ్నించాల్సింది పోయి తమ బీటు పరిధి కాదంటూ పట్టించుకోలేదని తెలిసింది. దీంతో ఆ యువకులు వాటర్ ప్యాకెట్లు, సరుకులు ఎంచక్కా అటవీప్రాంతంలోకి తరలించేశారు. స్థానిక స్మగ్లర్లు ఎర్రచందనం కూలీలకు రోజుకు రూ. 500 నుంచి రూ.1000 కూలీగా ఇస్తుండటంతో తమిళనాడు ప్రాంతం నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వ స్తున్నట్లు తెలుస్తోంది. పీడీ యాక్టులు, ఎన్‌కౌంటర్‌కు బెదరని కూలీలు జిల్లాలో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ మైదుకూరుకు చెందిన జాండ్లవరం శ్రీనివాసులు నాయుడు అలియా స్ డాన్శీనుపై పోలీసులు పీడీయాక్టు నమోదు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. అలాగే ఒంటిమిట్టకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఖాదర్‌వలీ అలియా స్ నందలూరు బాషాపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు పీడీయాక్టు నమోదు చేసి తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గత వారంలో రైల్వేకోడూరు పరిధిలోని బాలుపల్లె రేంజ్లో తమిళ కూలీ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. అయినప్పటికీ వీరు ఏమాత్రం బెదరకుండా తమిళనాడు నుంచి బెంగళూరు, అక్కడి నుంచి గుంతకల్లు మీదుగా కడపకు చేరుకొని అక్కడి నుంచి శేషాచలం అడవుల్లోకి వెళ్లిపోతున్నారు. బేస్ క్యాంపుల ద్వారా కూంబింగ్ ఎక్కడ ? జిల్లాలోని కడప, రాజంపేట, ప్రొద్దుటూరు అటవీ డివిజన్ల పరిధిలో వివిధ రేంజ్‌లలో అటవీ శాఖ ఉద్యోగులకు ఇటీవల జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జివిజి అశోక్‌కుమార్, డీఎఫ్ఓల చేతుల మీదుగా బోర్‌పంప్-12 రకానికి చెందిన తుపాకులను పంపిణీ చేశారు. అటవీ సిబ్బందికి సహాయంగా ఒక కంపెనీలో మూడు ప్లటూన్ల ఏఆర్ సిబ్బందిని నియమించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు ఇప్పటికే 45 బేస్ క్యాంపులు ఏర్పాటుచేశారు. బేస్‌క్యాంపులు కొన్ని దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉన్నాయి. బేస్ క్యాంపుల ద్వారా అడవుల్లో కూంబింగ్ నిర్విహ ంచాల్సి ఉంది. అటవీ సిబ్బంది ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా పొందిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయాల్సి ఉంటుంది. కానీ అటవీ సిబ్బంది ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో స్మగ్లర్లు అడవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లను నరికివేస్తున్నారనే విమర్శలున్నాయి. స్మగ్లర్ల ఏరివేతకు పోలీసు, అటవీ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
ఎర్ర దొంగల బురిడీ
సాక్షి, అనంతపురం : అటవీశాఖ సిబ్బందిని ఎర్ర చందనం స్మగ్లర్లు బురిడీ కొట్టించారు. జిల్లా అధికారి పేరుచెప్పి రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను దర్జాగా తీసుకెళ్లారు. అసలు సంగతి తెలుసుకున్న అధికారులు దొంగలను పట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్ర బంగారంగా భావించే ఎర్రచందనానికి పెట్టింది పేరు కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలు. ఈ జిల్లాల్లో అపారంగా విస్తరించి ఉన్న అడవుల్లో ఎర్రచందనం వృక్షాల్ని స్మగ్లర్లు తెగనరికి రాప్తాడు, న్యూస్‌లైన్ : రాప్తాడు మండలం పుల్లలరేవు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చినట్లు సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మధ్యాహ్నం నుంచే గ్రామంలో సంబరాల్లో మునిగి తేలారు. రాత్రి ద్విచక్రవాహనాలకు సెలైన్సర్ తీసి వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల ముందు కలియదిరుగుతూ చిందులేశారు. అంతటితో ఆగక ఇంటి ముందు టపాసులు కాలుస్తుండగా వైఎస్సార్సీపీ నేత భాస్కర్‌రెడ్డి తల్లి వెంకటలక్ష్మమ్మ అడ్డుచెప్పడంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు కర్రలు, రాళ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అయినా శాంతించని వారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు చెన్నారెడ్డి, మహీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నారెడ్డి, గంగాధర్, రాజశేఖర్‌రెడ్డి, ఆనంద్రెడ్డితోపాటు మరికొందరిపైనా దాడిచే శారు. మిద్దెలపెకైక్కి రాళ్లు రువ్వారు. దీంతో గ్రామంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా ఒక్కటై రావడంతో టీడీపీ కార్యకర్తలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డి, రాప్తాడు ఏఎస్ఐ జనార్ధన్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారినీ చెదరగొట్టి.. బందోబస్తు ఏర్పాటు చేశారు. తీవ్రంగా గాయపడిన వెంకటలక్ష్మమ్మను పోలీసులు 108 వాహనం ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి తలుపుల : చిన్నన్నవారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు శివప్రసాద్, శ్రీనివాసులు అతని భార్య రాధపై ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. వివరాల్లోకెళితే... తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ కార్యకర్తలు టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంటివద్ద గొర్రెలు తోలుకున్నామని, ఇక్కడ టపాసులు పేలిస్తే అవి బెదిరిపోతాయని అడ్డు చెప్పినందుకు వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీనివాసులు, అతని భార్య రాధతోపాటు మరో కార్యకర్త శివప్రసాద్‌పై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. తమపై టీడీపీ కార్యకర్తలు గంగిశెట్టితో పాటు, కాయలపల్లికి చెందిన శేఖర, చంద్ర, రామ్మోహన, పెద్దమల్లేసు, వెంకటయ్య తదితరులు దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ గోపాలుడు తెలిపారు. -
ఎంతటివారైనా వదిలిపెట్టం
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఎంత పలుకుబడి ఉన్నవారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖరబాబు తెలిపారు. మంగళవారం అర్బన్ ఎస్పీ తన కార్యాలయంలో పోలీస్ అధికారులతో క్రైం మీటింగ్ నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు యువ ఎస్ఐలతో 10 టీమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడున్న చెక్‌పోస్టులతో పాటు మరికొన్ని చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎవరెవరి ప్రమేయం ఉందో దర్యాప్తు చేయాలని, వారిందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా అదుపులోకి తీసుకోవాలని అన్నారు. సార్వత్రిక, మున్సిపల్, స్థానికసంస్థల ఎన్నికల బందోబస్తులో సమర్థవంతంగా విధులు నిర్వహించడం పట్ల అధికారులందరికీ ఎస్పీ అభినందనలు తెలిపారు. ఇక పాత కేసులపై దృష్టి సారించాలని, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఓఎస్డీలు రాజశేఖరరావు, చాందేనాయక్, సిద్ధారెడ్డి, డీఎస్పీలు రవిశంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, టంగుటూరి సుబ్బన్న, ఎంవీయస్ స్వామి, విమలాకుమారి, అభిషేకం, శ్రీనివాస్ రాజేంద్రప్రసాద్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.