అదుపులోకి తీసుకున్న కూలీతో ఐజీ కాంతారావు, పోలీసులు
చంద్రగిరి: మండలంలోని నరసింగాపు రం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున కూంబింగ్ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై ఎర్ర స్మగ్లర్లు దాడికి దిగారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురు దుండగులు పారిపోయారు. ఆర్‌ఎస్‌ఐ భాస్కర్ కథ నం మేరకు.. ఎర్రచందనం చెట్లు నరికేం దుకు స్మగ్లర్లు శేషాచలం అడవిలోకి వెళుతున్నట్టు ఐజీ కాంతారావుకు సమాచా రం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఆర్‌ఎస్‌ఐ భాస్కర్ తన బృందంతో కలిసి నరసింగాపురం అటవీ ప్రాంతంలో కూం బింగ్ చేపట్టారు. ఏడుగురు స్మగ్లర్లు నిత్యావసర సరుకులను తీసుకుని అడవిలోకి వెళుతున్నట్టు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిం చారు. నలుగురు అధికారులు మాత్రమే ఉన్నట్టు పసిగట్టిన స్మగ్లర్లు వారి వద్ద ఉ న్న ఆయుధాలతో తిరగబడ్డారు. అధి కారులు చాకచక్యంగా వ్యవహరించి ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని నిత్యా వసర వస్తువులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నారు.
తప్పిన ముప్పు
పారిపోతున్న కూలీలను పట్టుకునేం దుకు అధికారులు వారిని వెంబడించా రు. ఆ ప్రాంతంలో మూడు అడుగుల ఎత్తులో విద్యుత్ తీగలు ఉండడాన్ని గమనించి ఆగిపోయారు. దీంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. తీగలను గుర్తించకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికా రులు తెలిపారు. అధికారులపై కూలీలు దాడికి దిగినట్లు తెలుసుకున్న ఐజీ కాంతారావు అక్కడికి చేరుకుని సమీక్షిం చారు. ఐజీ మాట్లాడుతూ చీకట్లో విద్యుత్ తీగలకు తగిలి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. అనంతరం సిబ్బందిని ఆయన అభినందించారు. తనకు ముగ్గురు ఆడపిల్లలని నిందితుడు సేలం జిల్లాకు చెందిన ఆండి తెలిపాడు. తనకు డబ్బు ఆశను చూపి ఇక్కడికి తీసుకొచ్చి నట్లు పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హరినాథ్ బాబు, ఎఫ్‌ఆర్‌ఓలు ప్రసాద్, లక్ష్మీపతి, ఎసిఎఫ్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
వాహనం సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి మంగళం : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి స్ట్రైకింగ్ ఫోర్సు అధికారులు తెలపారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) జగదీష్ చంద్రప్రసాద్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజామున స్ట్రైకింగ్‌ఫోర్సు అధికారులు రేణిగుంట–పుత్తూరు హైవే గాజులమండ్యం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న మారుతీ జెన్ కారును ఆపారు. వాహనంలోని స్మగ్లర్లు పోలీసులను గమనించి పారిపోయారు. కారులో పరిశీలించగా 8 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. కారుతో సహా దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. వాటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎఫ్‌బీవో ఎం.మూనియానాయక్, స్ట్రైకింగ్ ఫోర్సు సిబ్బంది మురళి, పి.మూర్తి, జేసీ నారాయణ, నరసింహులు, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment