ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్మగ్లర్లను అరెస్టు చేయడం, వారిని జైలుకు పంపడంతో పాటు వారి అక్రమ ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అటవీ శాఖ అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పించనుంది. 2016లో వచ్చిన అటవీ శాఖ అమెండమెంట్ యాక్టు ప్రకారం ఎర్ర చందనం స్మగ్లర్లు కూడబెట్టిన అక్రమ ఆస్తులను జప్తు చేసేందుకు సమాయత్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : శేషాచలంలో ఉన్న అపారమైన వృక్ష సంపదలో ఎర్రచందనం ఒకటి. ఇప్పటికి 20 ఏళ్లుగా ఎర్ర చంద నం చెట్లను నరికి స్మగ్లర్లు సొ మ్ము చేసుకుంటున్నారు. చిత్తూ రు, కడప, కర్నూలు, ప్రకాశం జి ల్లాల్లో 70 లక్షల ఎర్ర చందనం చెట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. వీటి విలువ కోట్లలోనే. ఇదిలా ఉండగా నిత్యం శేషాచలంలోకి చొరబడుతున్న ఎర్ర స్మగ్లర్లను నిలువరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. ఎర్రచందనం పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్, అటవీ, పోలీస్ శాఖలు విస్తృతంగా అడవుల్లో కూంబింగ్ జరిపి రోజూ స్మగ్లర్లను అరెస్టు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు. స్మగ్లర్ల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. స్మగ్లింగ్ ఆగనూ లేదు.
ఈ క్రమంలో స్మగ్లర్లపై మరింత ఉక్కుపాదం మోపేందుకు సర్కారు ఆస్తుల జప్తును తెరమీదకు తెస్తోంది. ఇప్పటివరకూ ఎంతమంది స్మగ్లర్లు అరెస్టయ్యారు. వారికున్న ఆస్తుల విలువ ఎంత, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో గుర్తించేందుకు సిద్ధమైంది. అటవీ, పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి వివిధ జిల్లాల్లో ఉన్న స్మగ్లర్ల వివరాలను సేకరిస్తోంది. ఎర్రచందనం కేసుల్లో అరెస్టయిన వారి ఆస్తుల విలువను అంచనా వేసేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయనుంది. ఆస్తుల జప్తునకు సంబం ధించిన కేసుల విచారణాధికారులుగా డీఎస్పీలను నియమించనున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలో ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనుంది.
తొలి జాబితాలో వంద మందికి పైనే...
ఆస్తుల జప్తునకు ఉపక్రమించే ముందు ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్ల జాబితాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ జిల్లాల్లో చార్జిషీట్ ఫైల్ అయిన స్మగ్లర్ల వివరాలను సేకరించి ప్రభుత్వం తొలి జాబితా విడుదల చేయనుంది. సుమారు వంద మందికి పైగా వీరుంటారని సమాచారం. కేవలం అక్రమ ఆస్తులను మాత్రమే జప్తు చేసే వీలుందని అధికారులు అంటున్నారు. ఈ విషయం తెలిసి స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరుగె డుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment