
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఓ ఎస్‌ఐ నిర్వాకం కలకలం రేపుతోంది. ఈ మధ్యనే హనుమాన్ జంక్షన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్.. నూజివీడుకు చెందిన ఓ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం కొనసాగించి సస్పెండైన ఘటన మరువకముందే.. తాజాగా మరో ఎస్‌ఐ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా నూజివీడు వెంకటకుమార్ అనే ఎస్‌ఐ ఓ వివాహితను ఫోన్‌లో లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం.. సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ త్రిపాఠి ఆ ఎస్‌ఐని పిలిచి చీవాట్లు పెట్టారు. తాజాగా అతనిపై వేటు వేశారు. మూడు నెలలపాటు అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ త్రిపాఠీ ఆదేశాలు జారీ శారు. తెలుస్తోంది.
ఓ కేసు విషయంలో సాయం కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చిన వివాహితను న్యూజివీడు ఎస్సై వెంకటకుమార్ వేధించడం ప్రారంభించారు. ఆమె ఫోన్ నంబర్లు తీసుకొని.. ఫోన్‌లో తరచూ మాట్లాడుతూ ఆమెను లైంగికంగా వేధించారు. తన కోరిక తీర్చాలని, లేదంటే నీ భర్తను కేసులో ఇరికిస్తానని ఎస్సై నీచంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. తనను వేధించవద్దని, ఏదైనా అల్లరి జరిగితే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆమె వేడుకుంటున్నా ఆ ఎస్‌ఐ తీరు మారలేదు. ఆమె చెప్పినా వినకుండా గత కొద్ది రోజులుగా అదే పనిగా ఫోన్ చేసి వేధిస్తుండటంతో ఆమె.. ఆ ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ పై స్పందించిన జిల్లా ఎస్పీ.. ఎస్సై గత చరిత్రను ఆరా తీయగా.. వెంకటకుమార్ గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్సైపై ఎస్పీ వేటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment