
భర్త రాకేశ్‌తో కృష్ణవేణి(ఫైల్)
రాయికల్(జగిత్యాల): అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవవధువు పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై కరుణాకర్ వివరాల ప్రకారం... రాయికల్ పట్టణానికి చెందిన ఊరడి మల్లయ్య, గంగరాజుల కుమార్తె లహరి ఊరాఫ్ కృష్ణవేణి(22)కి ధర్మపురికి చెందిన శనిగారపు రాకేశ్‌తో ఆగస్టులో వివాహం అయ్యింది. ఆ సమయంలో రూ.15 లక్షల కట్నం ఒప్పుకోగా రూ.10 లక్షలు ఇచ్చారు. రాకేశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా చేస్తుంటాడు. ఈ క్రమంలో కృష్ణవేణిని కొంతకాలంగా అత్తింటివారు మిగితా కట్నం తేవాలని వేధించారు. దీంతో సద్దుల బతుకమ్మకు పుట్టింటికి వచ్చిన కృష్ణవేణిని తిరిగి అత్తారింటికి తీసుకెళ్లలేదు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన కృష్ణవేణి శనివారం పుట్టింట్లో ఉరివేసుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఊరడి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాజేశ్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment