
ప్రతీకాత్మక చిత్రం
శాంతినగర్(అలంపూర్) : కన్నతండ్రిపై కొడవలితో దాడిచేసి గాయపరిచిన కుమారుడు, కోడలిపై కేసు నమోదైన సంఘటన వడ్డేపల్లి మండలంలోని జిల్లెడిదిన్నెలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లెడిదిన్నెకు చెందిన ఖాసీమన్న వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్నాడు. అదే పొలంలో కుమారుడు రాఘవేంద్ర, కోడలు సంజమ్మ పొలం పనులు చేసుకుంటూ గొడవపడ్డారు.
ఈ క్రమంలో రాఘవేంద్ర తన చేతిలోని కొడవలితో తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. సంఘటనలో ఖాసీమన్న కుడిచేయి మూడు వేళ్లకు గాయమై రక్తస్రావమైంది. ఈ విషయమై శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఖాసీమన్న ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కుమారుడు, కోడలుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ మూర్తి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment