సభ్య సమాజం తలదించుకునేలా.. | Son Attempt to Molestation on Mother in Krishna | Sakshi
Sakshi News home page

సభ్య సమాజం తలదించుకునేలా..

Published Tue, Feb 12 2019 1:21 PM | Last Updated on Tue, Feb 12 2019 1:21 PM

Son Attempt to Molestation on Mother in Krishna - Sakshi

ఉయ్యూరు(పెనమలూరు): నవమాసాలు మోసి, రక్తమాంసాలు పంచి జన్మనిచ్చిన కన్నతల్లినే చెరబట్టాడు ఓ ప్రబుద్ధుడు. మద్యం మత్తులో తల్లిని చిత్రహింసలకు గురిచేసి ఆమెపై అత్యాచార యత్నం చేసి పైశాచికత్వం ప్రదర్శించాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉయ్యూరు రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు (86) తన చిన్నకుమారుడు శివయ్యతో కలసి ఉంటుంది. లారీ డ్రైవరుగా పని చేస్తున్న శివయ్యకు తల్లితో అభిప్రాయ భేదాలు ఉండేవని తెలిసింది.

ఆస్తి వివాదమే గతంలో తల్లీకొడుకులు ఇద్దరూ వివాదం పడి పోలీసులను ఆశ్రయించారు. తల్లిని ప్రేమగా చూసుకుంటానని చెప్పి తన వద్దే ఉంచుకుంటున్న ఆ కసాయి తనయుడు.. మద్యం మత్తులో ఇటీవల అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బంధువులు సోమవారం వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆరా తీయటంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న సీఐ కాశీ విశ్వనాథం సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాధితురాలిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అత్యాచారయత్నం, చిత్రహింసల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా వృద్ధురాలైన తల్లిపై ఆమె చిన్న కుమారుడు అత్యాచారానికి పాల్పడలేదని, శివయ్య బంధువులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement