
పాలకొండ రూరల్: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న కాకర్ల హేమలత (32) గురువారం ఆసుపత్రిలోని డ్యూటీ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 4:30 గంటలకు తన డ్యూటీ రూమ్‌కు వెళ్లిన ఆమె గంట వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో హేమలత కుటుంబసభ్యులు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో వారు సహచర సిబ్బందికి ఫోన్ చేశారు. సహచరులు డ్యూటీ రూమ్ కిటికీ నుంచి చూడగా హేమలత ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్నట్లు తెలిసింది. అయితే దీన్ని పోలీసులు ధృవీకరించలేదు.