
వాసుదేవ్ మృతదేహం
కెరమెరి(ఆసిపాబాద్): బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో మండలంలోని ఖైరీ గ్రామానికి చెందిన వాడై వాసుదేవ్(15) ఆత్మహత్య చేసుకున్నాడు. కెరమెరి ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలివీ..వాడై శంకర్–కమలాబాయి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దకు కూతుర్లు. వారిలో రెండో వాడు వాసుదేవ్ కెరమెరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా బైక్ కొనివ్వాలని తండ్రిని ఆడుగుతున్నాడు.
కాని ఈ సంవత్సరం కుదరదని, వచ్చే సంవత్సరం కొనిస్తానని తండ్రి చెప్పడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు రెఫర్ చేయగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment