సాక్షి, హైదరాబాద్: నగరంలోని డ్రగ్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేశారు. అయిదుగురు సభ్యులున్న ఈ ముఠాలో ఇద్దరు పోలీసులకు చిక్కగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టైన నిందితుల నుంచి 3 కేజీ గంజాయిని, 28 ఎల్‌ఎస్డీ స్లీప్స్, 32 అంఫేటమిన్ డ్రగ్ ప్యాకెట్స్‌తో పాటు 5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 2.5 విలువ ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
కాగా తమిళనాడుకు చెందిన ఫ్రాన్సిస్ జేవియర్ ఈ ముఠాకు నాయకుడిగా వ్యవహరిన్నాడని, 25ఏళ్ల క్రితమే ఇతని కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడిందని తెలిపారు. ఇక ఫ్రాన్సిస్ జేవియర్‌కు ఇంటర్ నుంచే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ ముఠా అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ హోటల్, బార్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని, నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలపాలకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment