టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు
సీతమ్మధార(విశాఖ ఉత్తర): అక్రమంగా నగదు మార్పిడి చేస్తున్న (హవాలా వ్యాపారం) ముఠాని టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ద్వారకాజోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకానగర్ ఎస్.ఎస్.ఆర్.రెసిడెన్సీ ఎదురుగా వనిత రెసిడెన్సీ ప్లాట్ నెంబర్ – 403లో మంగళవారం ఉదయం హవాలా వ్యాపారం చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏసీపీ మహేంద్ర మాతే సిబ్బందితో దాడులు చేశారు.
ఈ దాడుల్లో టైకోన్ రోడ్డు బాలాజీనగర్‌కు చెందిన చలుమూరి రామకృష్ణ, కైలాసాపురం, గాంధీ విగ్రహం కృష్ణానగర్‌కు చెందిన చల్లా నారాయణను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.38 లక్షల76 వేల 350తో పాటు ఫ్యాక్స్ మిషన్, నగదు లెక్కింపు యంత్రం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ద్వారకా జోన్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మహేంద్ర మాట్లాడుతూ ఇన్‌కంటేక్స్ డిపార్టుమెంట్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment