
సాక్షి, హైదరాబాద్ : విచక్షణ కోల్పోయి ఓ ఉపాధ్యాయుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. వాస్తవాలు తెలుసుకోకుండా విద్యార్ధిపై విరుచుకుపడి చావబాదాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కొత్తగూడాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేణు అనే బాలుడు కొత్తగూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం పాఠశాల ప్రాంగణంలో ఉన్న నల్లా నీరు వృధాగా పోతుంటే నల్లా ఆపు చేశాడు. ఈ విషయాన్ని వాచ్‌మెన్‌కు చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. నల్లా ఆపుచేయటమే అతడు చేసిన నేరమైంది.
మరుసటి రోజు ఉపాధ్యాయులు వేణును పిలిపించి చితకబాదారు. అనంతరం బాలుడ్ని తరగతి గదిలోనే నిర్భందించారు. గోవింద్ అనే ఉపాధ్యాయుడు బాలుడే నల్లా విరగ్గొట్టాడని ఆరోపిస్తూ అతడిని కట్టెతో తీవ్రంగా చితకబాదాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా బెదిరించటంతో బాధితులు ఆలస్యంగా గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Comments
Please login to add a commentAdd a comment