teacher attacks
-
టీచర్ దెబ్బలకు విద్యార్థి మృతి.. సీఎం సంచలన వ్యాఖ్యలు
ఉదయపూర్: దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. తాజాగా రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దీంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడిని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన జూలైన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఘటనపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు ప్రతీ రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయన్నారు. టీవీలో, పత్రికల్లో వీటిని మనం చూస్తూనే ఉంటామని చెప్పారు. బాలుడిని కొట్టడాన్ని తాను కూడా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన సీఎం.. ఇలాంటి ఘటన ఎక్కడ జరిగినా నేరమని అన్నారు. కానీ, ఇలాంటి ఘటనలను కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా చూడటం విచారకరమని గెహ్లాట్ ఆవేదన వ్యక్తపరిచారు. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని సీఎం తెలిపారు. బాలుడిని కొట్టిన టీచర్ చైల్ సింగ్(40)ను అరెస్ట్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ఇంతకంటే ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు వేరే పనిలేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రతీ విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: స్వాతంత్ర్య వేడుకల వేళ సోనియా సీరియస్ -
విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు శనివారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన విద్యార్థిని బి.కొత్తకోట ఏపీ మోడల్ స్కూల్లో చదువుతోంది. అదే పాఠశాలలో నగరి నియోజకవర్గానికి చెందిన నవీన్ తెలుగు ఉపాధ్యాయుడు. సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థిని ఇంటికొచ్చింది. ఈ క్రమంలో నవీన్ గురువారం ఆమెను కలిసి పాఠశాలకు సంబంధించిన వివరాలు మాట్లాడాలని చంద్రాకాలనీ గురుకుల పాఠశాలలో పనిచేసే తన పినతల్లి ఉండే క్వార్టర్స్‌కు తీసుకెళ్లాడు. ఆ సమయంలో పినతల్లి ఇంట్లో లేకపోవడంతో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికకు పట్టణంలోని ఓ థియేటర్లో సినిమా చూపించి, ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తమ కుమార్తె ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
క్లాస్‌లో అందరూ చూస్తుండగానే..
-
క్లాస్‌లో అందరూ చూస్తుండగానే..
యశ్వంత్‌పూర్ : కర్ణాటకలోని రాజాజీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బసవేశ్వర స్కూల్లో ఓ విద్యార్థిపై అధ్యాపకుడు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు . కొద్దిరోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. సురేశ్ అనే అధ్యాపకుడు రవి అనే విద్యార్థిని చితకబాదాడు. తప్పుగా ప్రవర్తించాడనే నెపంతో క్లాస్‌రూమ్‌లో ఇతర విద్యార్థుల ముందటే రవిపై ఇష్టానుసారం విరుచుకుపడ్డాడు. స్కూల్ బ్యాగ్‌ను అతని పైకి విసిరాడు. రవి అక్కడి నుంచి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ.. వెంటపడి మరి ఎక్కడపడితే అక్కడ కొట్టాడు. రవి బతిమాలిన వినిపించుకోలేదు. టీచర్ ఇలా ప్రవర్తించడంతో క్లాస్‌రూమ్‌లోని మిగతా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలను క్లాస్‌రూమ్‌లోని ఓ విద్యార్థి తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ వీడియో బయటకు రావడంతో సురేశ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రవిపై దాడికి పాల్పడ్డ సురేశ్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఉపాధ్యాయుడి పైశాచికత్వం
సాక్షి, తుని(తూర్పు గోదావరి) : విద్యార్థులను తండ్రిలా చూసుకుంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన హెచ్ఎం పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హల్చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కోటనందూరు మండలంలో ఏకైక గిరిజన గ్రామం సంగవాక. అక్కడి గిరిజన సంక్షేమ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న కోటేశ్వరరావు పాఠశాల సమయంలో సాధారణ డ్రెస్ (లుంగీ)తో ఉండి తన పడకగదిలో విద్యార్థులను చితకబాదుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన గ్రామస్తులు సోమవారం విలేకర్లకు ఆ వివరాలను తెలియజేశారు. గతంలో ఈ పాఠశాలలో హాస్టల్ ఉండేదని వారు తెలిపారు. హెచ్ఎంగా కోటేశ్వరరావు, వార్డెన్‌గా ఎ. నూకరాజు వచ్చిన తరువాత వారి పనితీరుతో హాస్టల్‌ను ఎత్తి వేశారన్నారు. వీరిద్దరూ విధి నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పాఠశాలలో పిల్లలు పూర్తిగా తగ్గిపోయారన్నారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 35 మంది పిల్లలు మాత్రమే ఈ పాఠశాలలో ఉన్నారని తెలిపారు. హెచ్ఎం కోటేశ్వరరావు పిల్లలను హింసిస్తూ, కొడుతున్నారని గ్రామపెద్ద పిట్టం బాబూరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంఈఓ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పాఠశాల సమయంలో కూడా హెచ్ఎం, వార్డెన్ టీవీ రూంకు పరిమితమై ఉంటున్నారని, వీరిని మార్చాలని ఫిర్యాదులో కోరారు. ఈ దుస్థితిపై ఉన్నతాధికారులందరికీ సమాచారం చేరవేసినట్టు గ్రామస్తులు తెలిపారు. -
చిన్నారిపై ఉపాధ్యాయుడి దాష్టికం!
సాక్షి, విజయవాడ: ఓ ఉపాధ్యాయుడు స్కూలు విద్యార్ధిని దారుణంగా చితకబాదిన ఘటన విజయవాడ చిట్టినగర్‌లో చోటుచేసుకుంది. మోటూరి హనుమంత రావు నగర పాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిన్నారిని, కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు చేతి మీద వాతలు తేలేలా కొట్టాడు. దీంతో కన్నీరు పెట్టుకుంటూ ఆ విద్యార్ధి స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. చిన్నారి తల్లి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అడగగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కాగా నెల రోజుల క్రితమే ఉపాద్యాయుడు కోటేశ్వరరావు బదిలీపై వేరే పాఠశాలనుంచి ఇక్కడి వచ్చారు. -
విద్యార్ధిపై ఉపాధ్యాయుడి దాష్టికం.. నల్లా విరగ్గొట్టాడని..
సాక్షి, హైదరాబాద్ : విచక్షణ కోల్పోయి ఓ ఉపాధ్యాయుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. వాస్తవాలు తెలుసుకోకుండా విద్యార్ధిపై విరుచుకుపడి చావబాదాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కొత్తగూడాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేణు అనే బాలుడు కొత్తగూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం పాఠశాల ప్రాంగణంలో ఉన్న నల్లా నీరు వృధాగా పోతుంటే నల్లా ఆపు చేశాడు. ఈ విషయాన్ని వాచ్‌మెన్‌కు చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. నల్లా ఆపుచేయటమే అతడు చేసిన నేరమైంది. మరుసటి రోజు ఉపాధ్యాయులు వేణును పిలిపించి చితకబాదారు. అనంతరం బాలుడ్ని తరగతి గదిలోనే నిర్భందించారు. గోవింద్ అనే ఉపాధ్యాయుడు బాలుడే నల్లా విరగ్గొట్టాడని ఆరోపిస్తూ అతడిని కట్టెతో తీవ్రంగా చితకబాదాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా బెదిరించటంతో బాధితులు ఆలస్యంగా గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
ఉపాధ్యాయుడు కాదు.. ఉన్మాది
కర్నూలు: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఉన్మాదిగా మారాడు. ప్రేమించమంటూ విద్యార్థిని వెంటపడి వేధించాడు. అసభ్యకరంగా ప్రవర్తించి ఆమెను క్షోభ పెట్టాడు. ఆ విద్యార్థిని ప్రతిఘటించడంతో.. కత్తితో గొంతుకోశాడు. ఈ ఘటన శనివారం కర్నూలులో జరిగింది. ఆత్మకూరు మండలం రాంపురానికి చెందిన శంకర్ నాయక్ కర్నూలు ఐదు రోడ్ల కూడలిలోని రాక్‌వుడ్ ఎయిడెడ్ స్కూల్లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిగా కర్నూలులోని బంగారుపేటలో నివాసముంటున్నాడు. కాలనీకి చెందిన ఓ విద్యార్థిని రాక్‌వుడ్ స్కూల్లోనే తొమ్మిదో తరగతి చదువుతోంది. శంకర్‌నాయక్ కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ ఆ విద్యార్థిని వెంట పడి వేధిస్తున్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. శనివారం ఉదయం ఆమె తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన శంకర్ వారి ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపులు బిగించి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో తన వెంట తీసుకెళ్లిన కత్తితో గొంతు కోశాడు. భయాందోళనకు గురైన ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు చేరుకున్నారు. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లేసరికి.. బాలిక తీవ్రగాయాలతో కిందపడి ఉంది. జనం లోపలికి దూసుకురావడంతో భయపడిపోయిన శంకర్ నాయక్.. అదే కత్తితో తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాలికను, నిందితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, నిందితుడిపై ఫోక్సో యాక్ట్ 307, 354డి, 354, 450, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ ఎస్ఐ జగన్ మీడియాకు తెలిపారు. ఈ ఘటన గురించి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. -
టీచర్ దాడితో కుప్పకూలిన విద్యార్థి
కృష్ణా: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో దారుణం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని ఎనిమిదో తరగతి బాలుణ్ని చితకబాదాడు. సుధాకర్ అనే ఉపాధ్యాయుడు హోంవర్క్ చేయలేదని ఆ విద్యార్థిపై ఆగ్రహంతో మెడపై కొట్టాడు. దీంతో ఆ బాలుడి నరాలు దెబ్బతినడంతో కాళ్లు, చేతులు పనిచేయలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.