
సాక్షి, విజయవాడ: ఓ ఉపాధ్యాయుడు స్కూలు విద్యార్ధిని దారుణంగా చితకబాదిన ఘటన విజయవాడ చిట్టినగర్‌లో చోటుచేసుకుంది. మోటూరి హనుమంత రావు నగర పాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిన్నారిని, కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు చేతి మీద వాతలు తేలేలా కొట్టాడు. దీంతో కన్నీరు పెట్టుకుంటూ ఆ విద్యార్ధి స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
చిన్నారి తల్లి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అడగగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కాగా నెల రోజుల క్రితమే ఉపాద్యాయుడు కోటేశ్వరరావు బదిలీపై వేరే పాఠశాలనుంచి ఇక్కడి వచ్చారు.