పోలీసుల అదుపులో కీచక టీచర్‌ | teacher harrasments school girls at eluru | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో కీచక టీచర్‌

Published Tue, Dec 24 2019 3:43 AM | Last Updated on Tue, Dec 24 2019 4:32 AM

teacher harrasments school girls at eluru - Sakshi

పాఠశాలలో వివరాలు తెలుసుకుంటున్న వన్‌టౌన్‌ ఎస్‌ఐ కిశోర్‌బాబు (ఇన్‌సెట్‌లో) కీచక టీచర్‌ కూరపాటి కిశోర్‌

ఏలూరు టౌన్‌: పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.  పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోని వన్‌టౌన్‌ బావిశెట్టివారిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు ఐదవ తరగతి చదువుతున్నారు. ఉపా«ధ్యాయుడు కూరపాటి కిశోర్‌ వారి పట్ల మధ్యాహ్నం సమయంలో వేర్వేరుగా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. విషయాన్ని ఇద్దరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలపటంతో వారు సోమవారం స్థానిక వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులతో కలసి పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీచర్‌ కిశోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికలు, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించి రెండు పోక్సో కేసులు నమోదు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement