
ప్టాస్టిక్ కవర్‌తో ముఖాన్ని దాచేస్తున్న దొంగ
దొంగతనాలు ఎలా చేయాలో వీడికి బొత్తిగా తెలిసినట్టులేదు. సినిమాలు, సీరియల్స్ ఏమాత్రం ఫాలో అయినట్లు లేదు. అయ్యగారుకి చోరవిద్య కొత్తమో మరీ. దీంతో ఓ మొబైల్ షాపులోకి దొంగతనానికి వెళ్లిన చోర శిఖామణి అడ్డంగా దొరికిపోయాడు. ఎవరైనా దొంగతనానికి వెళ్తూ.. ఫేస్ కనిపించకుండా ఏదైనా మాస్క్ వేసుకుంటారు. కానీ, ఇతగాడు మాత్రం ముఖం స్పష్టంగా కనిపించేలా...ప్లాస్టిక్ కవర్‌ను చుట్టుకున్నాడు. అది కూడా చాలదన్నట్లు తన చేతిపై ఉన్న టాటు... షాపులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దొంగ మాత్రం తన పని కానిచ్చుకుని దర్జాగా వెళ్లిపోయాడు. తర్వాత రోజు షాపు యజమాని ...షాపులో చోరీ అయిన సంగతి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఆ దొంగని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.