
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని రాయికల్ గ్రామ శివారులోని రామేశ్వరం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలోని కొన్ని హుండీలను దొంగలు ధ్వంసం చేశారు. హుండీల్లో ఉన్న నగదును దొంగలు తీసుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. దొంగతనం జరిగిన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది స్థానిక దొంగల పనా లేక అంతరాష్ట్ర దొంగల పనా అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment