స్వాధీనం పరచుకున్న బైకులు
పీఎంపాలెం (భీమిలి): రోడ్డుపై నిలిపిన ద్విచక్రవాహనాలు చోరీ చేయడంలో ఘనత వహిం చిన నలుగురు ఘరానా దొంగలను పీఎంపాలెం పోలీసులు అరెస్టు చేశా రు. వీరితోపాటు ఒక బాల నేరస్తుడ్ని, చోరీ సోత్తు కొనుగోలు చేసినందుకు ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ సీఐ కె. ఈశ్వరరావు తెలిపిన వివరాలు.. ఈ ప్రాంతంలో ఇటీవల పార్కింగ్ చేసిన ద్విక్రవాహనాలు చోరీకి సంబంధించి అధికంగా ఫిర్యాదులు అందడంతో నేరవిభాగం ఎస్‌ఐలు సూరిబాబు, అప్పారావు ప్రత్యేక దృష్టి సారించారు. ముందస్తు సమాచారం మేరకు బైకుల చోరీ ముఠాతో సంబంధం ఉన్న శివశక్తి నగర్‌కు చెందిన కళ్లేపల్లి రమేష్‌పై నిఘా వేసి శనివారం ఇక్కడి క్రికెట్ స్టేడియంకు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
శివవక్తినగర్ ప్రాంతానికే చెందిన రౌతు శ్రీనివాస్, డి.రవికుమార్, ఆర్ హెచ్ కాలనీకి చెందిన కాకర పోతురాజు, కొలకాని పవన్‌కుమార్లు ముఠాగా ఏర్పడి బైకులు విలువైన వస్తువుల చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వీరు చోరీ చేసిన ద్విచక్రవాహనాలు, విలువైన వస్తు సామగ్రికి సంబంధించి పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో 6 కేసులు నమోదు కాగా భీమిలి పోలీస్ స్టేషన్‌లో 3, ఆనందపురం పోలీస్ స్టేషన్‌లో 3 కేసులు, పద్మనాభం, విజయనగరం పోలీస్ స్టేషన్‌లలో ఒక్కొకటి నమోదయినట్టు గుర్తించారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన శివశక్తి నగర్‌కు చెందిన రాంబాబు, నారాయణమూర్తిలను సైతం అరెస్టు చేసి రిమాండుకు తరలించామని సీఐ తెలిపారు.
9 బైకులు స్వాధీనం
నిందితుల వద్ద నుంచి వివిధ ప్రదేశాలలో చోరీ చేసిన సుమారు రూ. లక్ష విలువ చేసే 9 బైకులు స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ ఎస్‌ఐలు తెలిపారు. వీటితోపాటు వాటర్ పంపింగ్ చేసే 2 మో టార్లు, ఒక టీవీ, గ్రైండింగ్ మిషన్ మొదలైన విలువైన సామగ్రిని స్వాధీనపరచుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన క్రైమ్ విభాగం హెచ్‌సీ పైడిరాజు, పైడంనాయుడు, రాజేష్, అనిల్, బాలులను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment