
సాక్షి, విశాఖ : నగరంలోని పోర్టు రోడ్డులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. బైక్‌పై వెళుతున్న సిటీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ సూపర్‌వైజర్ శ్రీనివాసరావుపై దుండగులు కత్తితో దాడి చేశారు. అతని వద్ద రూ.20 లక్షల నగదు లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మల్కాపురం, హార్బర్ పోలీసులు రంగంలోకి దిగి బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. గాజువాకకు చెందిన శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై బుధవారం మధ్యాహ్నం పోర్టు పరిధిలోని ఐఎన్‌ఎస్ డేగా వైపుగా వెళుతున్నాడు. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని మధ్యలో ఆపి దాడి చేశారు. ఆ తర్వాత శ్రీనివాసరావు వద్ద ఉన్న రూ.20 లక్షలు పట్టుకుని వెళ్లిపోయారు. వెంటనే బాధితుడు హార్బర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దోపిడీ తెలిసినవాళ్ల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.




Comments
Please login to add a commentAdd a comment