రాయగడ జిల్లాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు
రాయగడ: రాయగడ జిల్లా కాశీపూర్ సమితి రెల్లిగుమ్మ రైల్వేస్టేషన్ వద్ద నడుస్తున్న ట్రైన్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు బాలురును బయటకు తోసివేయడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని టికిరి ప్రాంతం డబుడ గ్రామానికి చెందిన సంతోష్‌నాయక్ (13) లచన్‌నాయక్(15)లు వివాహానికి హాజరయ్యేందుకు కొరాపుట్ నుంచి రాయగడకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా కదులుతున్న ట్రైన్ నుంచి రెల్లిగుమ్మ స్టేషన్ దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరినీ తోసివేయడంతో ప్రమాదకరమైన గాయాలయ్యాయి. ఈ పరిస్థితిని గుర్తించిన తోటి ప్రయాణికులు తక్షణం శ్యామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో వారిద్దరినీ రాయగడ జిల్లా ఆస్పత్రికి పంపించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment