మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీజీ
సాక్షి, విజయవాడ: భారీగా లంచం తీసుకుంటూ కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ ఏడుకొండలు, అసిస్టెంట్ కమిషనర్ అనంతరెడ్డి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు దొరికారు. వీరిద్దరూ తమ ఛాంబర్‌లో ఐటీడీ సిమెంటేషన్ కంపెనీ ప్రతినిధుల నుంచి రూ.23.50 లక్షలు లంచం తీసుకుంటూ శుక్రవారం పట్టుబడ్డారు. రూ.4.50 కోట్ల మేర పన్ను రాయితీ ఇప్పించేందుకు ఏడుకొండలు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్టు తెలిసింది. వాణిజ్యపన్నుల శాఖలో ఆయన జీఎస్టీ విభాగం బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
ఐటీడీ కంపెనీకి చెల్లించాల్సిన ఇన్‌ఫుట్ పన్ను రాయితీ విడుదలకు ఏడుకొండలు, అనంతరెడ్డి రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. కంపెనీలు ప్రతినిధులు తమను ఆశ్రయించడంతో ఈ బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చామన్నారు. కమర్షియల్ టాక్స్ విభాగంకు సంబంధించి మొత్తం నలుగురి అధికారుల ప్రమేయం వుందని వెల్లడించారు. నిందితులను విచారించిన తర్వాత రేపు అరెస్ట్ చేస్తామన్నారు. ఐటీడీ సిమెంటేషన్ సంస్థ.. విశాఖ, గంగవరం పోర్ట్ బెర్త్ నిర్మాణాలను చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment