
సాక్షి, హైదరాబాద్ : ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా నిర్మిస్తున్న షేక్ పేట్ ఓయూ కాలనీ ఫ్లైఓవర్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ ఒక్కసారిగా రోడ్డు ప్రక్కకు పోవడంతో భారీ క్రేన్ అదుపుతప్పింది. భయంతో ఒక్కసారిగా క్రేన్ ఆపరేటర్ కిందకు దూకడంతో క్రేన్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
సంఘటన స్థలాన్ని జిహెచ్ఎంసి కమీషనర్ దాన కిషోర్ పరిశీలించారు. ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా పరిహారాన్ని అందజేయాలని ఆదేశించారు. ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో దురదృష్ట సంఘటన జరగడం ఇదే మొదటిసారి. షేక్ పెట్ వద్ద కుంగిన భారీ క్రేన్ వెంటనే తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రాజెక్టు విభాగం ఇంజనీరింగ్ అధికారుల ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment