సాదు పావని, పసరగొండ అనూష(ఫైల్)
దుగ్గొండి(నర్సంపేట) : ఓ మహిళతో పాటు మరో బాలిక అదృశ్యమైన సంఘటన వరంగల్‌రూరల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన సాదు పావని(16), పసరగొండ అనూష(21)లు మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఇంటి వద్ద ఉండి ఆ తర్వాత కనబడకుండా పోయారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులకు వారు కనబడకపోవడంతో బంధువుల ఇండ్లు, తెలిసిన వారి ఇండ్లు వెదికినా ఫలి తం లేదు. దీంతో సాదు పావని తల్లి సాదు రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బోనాలకిషన్ తెలిపారు. ఇద్దరి ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం అందిస్తామన్నారు. వివరాలు తెలిసిన వారు సీఐ బోనాల కిషన్ 9440795245, ఎస్సై భాస్కర్‌రెడ్డి 9440904642లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment