
గీత(ఫైల్) ఆకాంక్ష (ఫైల్)
చెన్నారావుపేట(నర్సంపేట): వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలకేంద్రం లోని రాజీవ్‌నగర్–1 కాలనీకి చెందిన జన్ను రాజేష్ భార్య జన్ను గీత గత నెల 28న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె వయసు 23 ఏళ్లు ఉంటాయి. బంధువుల ఇళ్లలో, పలు ప్రదేశాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో ఆదివారం భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.
మొగుళ్లపల్లిలో...
మొగుళ్లపల్లి(భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన ఆకాంక్షకు ఇదే మండలం కొర్కిశాల గ్రామానికి చెందిన యువకుడితో గత ఏడాది వివాహమైంది. కాగా శనివారం ఆమె తల్లిగారి ఇంటికి వెళ్లింది. అదేరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తండ్రి తిప్పారపు శివరావు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చల్లా రాజు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9440904634కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment