
ఘటనా స్థలంలో పరిశీలిస్తున్న పోలీసులు, రిజర్వాయర్‌లో పడి ఉన్న మొండెం
సాక్షి, చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తండా పంచాయతీ పరిధిలోని మల్లన్నగండి దేవాదుల రిజర్వాయర్ సమీపంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి(45)ని హత్య చేశారు. ఈ సందర్భంగా తల, మొండెంను వేరు చేసి కేవలం మొండెం తీసుకొచ్చి రిజర్వాయర్‌లో వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి మృతుడిని సమ్మక్క గద్ధెల సమీపంలోకి తీసుకొచ్చి పదునైన కత్తితో నరికారు. ఆ తర్వాత చున్నీతో మృతుడి కాళ్లు కట్టి లాక్కుంటూ రిజర్వాయర్ వద్ధకు ఈడ్చుకువచ్చినట్లు గుర్తించారు. అదే చున్నీ మరో చివరకు రాయి కట్టి మృతదేహం తేలకుండా రిజర్వాయర్‌లో వేసినట్లు తెలుస్తోంది. అయితే, అయితే చీకటిగా ఉండడంతో మృతదేహం గట్టు సమీపంలో రాళ్లకు తట్టి ఉండి పోయింది. కాగా, ఘటనా స్థలంలో లేడీస్ వాచ్ లభించడం, మృతదేహాన్ని చున్నీతో కట్టడంతో నేరంలో ఓ మహిళ కూడా పాల్గొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం డీసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వరబాబు, సీఐ రాజిరెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు డాగ్‌స్క్వాడ్ చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment