బాధితుడు మస్తానయ్య
కోవూరు: విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన మండలంలోని జమ్మిపాళెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జమ్మిపాళెం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కె.మస్తానయ్యపై కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతనితోపాటు పనిచేస్తున్న మరో టీచర్ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రణాళిక ప్రకారం దాడి చేయించినట్లు చెబుతున్నారు. సదరు టీచర్ ప్రణాళిక ప్రకారమే సెలవు పెట్టారని, లీవ్ లెటర్ ఇచ్చిన కొద్దిసేపటికే తనపై దాడి చేయడం జరిగిందని మస్తానయ్య వాపోయారు. ఈ విషయమై కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడి అమానుషం
దళిత టీచర్ అయిన మస్తానయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 30 మంది పైగా దాడి చేయడం అమానుషమని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ మండల ప్రధాన కార్యదర్శి ఎ.రవీంద్రబాబు అన్నారు. ఉపాధ్యాయుల మధ్య సమస్యలుంటే సంఘాలకు తెలుపుకొని వారి సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు. వ్యక్తిగత దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి దాడుల్ని ఉపేక్షించేదిలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment