నీటిగుంతలో పడి దుర్మరణం చెందిన చరణ్, జశ్వంత్ మృతదేహాలు
మహేశ్వరం : నీటి నిల్వ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని దుబ్బచర్ల గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దుబ్బచర్ల గ్రామానికి చెందిన బండ శ్రీశైలం, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నీటి నిల్వ కోసం పొలం వద్ద పెద్ద గుంత తీసి బోరు నీటిని నింపుతున్నారు. పాఠశాలలకు సెలవు కావడంతో తల్లి లక్ష్మీతో కలిసి కుమారులు బండ చరణ్‌తేజ(9), జశ్వంత్(7), మణి(5)లు పొలం వద్దకు వెళ్లారు.
తల్లి గొర్రెలను పొలం వద్ద మేపుతుండగా చిన్నారులు ఇద్దరు కాళ్లు చేతులు కడుక్కునేందుకు గుంత వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడిపోయారు. వీరిలో చిన్నవాడు ఇద్దరు అన్నలు గుంతలో పడిన విషయాన్ని చూసి భయంతో ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లికి చెప్పాడు. వెంటనే తల్లి నీటిగుంత వద్ద వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు నీటి మునిగి దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని భర్త శ్రీశైలం, గ్రామస్తులకు తెలపడంతో సంఘటన స్థలానికి గ్రామస్తులు భారీగా చేరుకున్నారు.
గ్రామంలో విషాదఛాయలు..
ఇద్దరి చిన్నారులు నీటిగుంతలో పడి మరణిం చడంతో తల్లిదండ్రులు, బంధువులు ఇద్దరి చిన్నారుల మృతదేహాలను చూసి బోరున విలపించా రు. విషయం తెలుసుకున్న మహేశ్వరం పోలీసు లు గ్రామానికి చేరుకొని ఇద్దరి మృతికి గల కారణాలను బాధిత తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వారు తవ్విన గుంతలో వారి పిల్లలు ప డి దుర్మరణం చెందడం అందరినీ కలిచివేసింది.
గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నీటి గుంతలో పడి చనిపోవడం విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యుల ను పీసీసీ సభ్యుడు కొరుపోలు రఘుమారెడ్డి, గ్రా మ సర్పంచ్ కోమటమ్మ, నాయకులు హనుమానాయక్, బాలరాజ్ పలువురు మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment