
డోన్ టౌన్: కుమారుడిని కనలేదని భర్త, అత్త వేధింపులకు గురిచేస్తున్నారని ఓ వివాహిత శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. రూరల్ ఎస్‌ఐ మధుసూదన్‌రావు తెలిపిన వివరాలు.. బేతంచెర్ల మండలం రహిమాన్‌పురం గ్రామానికి చెందిన సుభద్రకు ఏడేళ్ల క్రితం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులతో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే కుమారుడిని కనలేదని భర్త, అత్త వేధిస్తున్నారని బాధితురాలు సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment