
సాక్షి, దేవనకొండ : పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేసి, నగలతో ఉడాయించిన ఘటన మండల పరిధిలోని అలారుదిన్నె గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. అలారుదిన్నె గ్రామానికి చెందిన మహాలక్ష్మి బళ్లారి–కర్నూలు రహదారిలో ఉన్న పొలానికి ఉదయమే వెళ్లింది. ఒంటరిగా పనులు చేసుకుంటూ ఉండటాన్ని గమనించిన ఓ దుండగుడు ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై నిలిపి, మహిళ దగ్గరకు చేరుకున్నాడు. ఏదో సమాచారం అడుగుతున్నట్లు నటించి, మెడలోని పుస్తెల తాడు లాక్కునేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తలను పక్కనే ఉన్న బండకేసి కొట్టి తాలిబొట్లు తెంచుకొని పరారయ్యాడు. మహిళ కేకలు విన్న సమీపం పొలంలో ఉన్న కుమారుడు పరుగెత్తుకొచ్చేలోపు దుండగుడు ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడు. దీంతో మహిళ లబోదిబోమంటూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment