
చికిత్స పొందుతున్న లక్ష్మీరాజ్యంతో మాట్లాడుతున్న ఎస్సై
నాయుడుపేటటౌన్: అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా అవమానకరంగా మాట్లాడారనే మనస్థాపంతో వారి ఎదుటనే ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నాయుడుపేట నగర పంచాయతీ కార్యాలయం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట మండలం మంగళంపాడుకు చెందిన కూరపాటి లక్ష్మీరాజ్యం భర్తతో విడాకులు తీసుకుని పదేళ్లుగా నాయుడుపేటలోని అమరాగార్డెన్‌లో నివాసం ఉంటుంది. ఆమె వద్ద ఉన్న బంగారు నగలు తాకట్టు పెట్టి పట్టణంలో ఉన్న ఏ సాయిశ్రీనివాస్ అలియాస్ వాసు అనే వ్యక్తికి 2015లో వడ్డీకి రూ.5.90 లక్షలు నగదు అప్పుగా ఇచ్చింది.
అయితే వడ్డీ ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తుండడంతో కొద్ది రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆమెతో రాజీ చర్చలు జరుపుకుని రూ.8 లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం కుదిరి, గత నెలలో చెక్కును సైతం ఇచ్చాడు. గత నెలాఖరులో నగదు ఇస్తామని రామ్మని చెప్పాడు. దీంతో ఆమెకు రావాల్సిన నగదు కోసం మంగళవారం లక్ష్మీరాజ్యం వాసు ఇంటికి వెళితే వారు డబ్బులు ఇవ్వమని చెప్పి అవమానకరంగా మాట్లాడారు. దీంతో మనస్థాపం చెంది వారి ఇంటి ముందే నిద్ర మాత్రలు మింగింది. ఈ మేరకు ఎస్సై జీ వేణు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment