
కోల్‌కతా : ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని సోనపూర్‌లకు చెందిన 18 ఏళ్ల యువతి తల్లి దండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. యువతి తల్లి దగ్గరలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
గత శని వారం సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వచ్చిన యువతి విచారంగా ఇంట్లోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు తల్లి డ్యూటీకి వెళ్లింది. ఆ సమయంలో యువతి తండ్రి, సోదరుడు కూడా పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న యువతి శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
కాగా ఆదివారం ఉదయం తల్లి ఇంటి వచ్చి తలుపులు తట్టినా తెరవకపోవడంతో కిటికిలోనుంచి తొంగి చూసి, విగత జీవిగా ఉన్న కూతురుని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆ యువతి మొబైల్ చూడగా ఫేస్‌బుక్ లైవ్‌లో ఓ యువకుడితో మాట్లాడినట్లు ఉందని, అతను ఆమె ప్రియుడు కావొచ్చని పోలీసులు తెలిపారు. కాగా తన కూతురు శనివారం సాయంత్రం విచారంగా ఇంటికి వచ్చిందని, దిగులుగా గదిలోకి వెళ్లిందని యువతి తల్లి పేర్కొన్నారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టంకి తరలించి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment