
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో విదేశాలకు చెక్కేస్తున్న 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలు కలిగిన వీరు కువైట్ వెళ్లేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. మహిళలను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment