మహిళా పీడీఓకు వేధింపులు | Woman Official Suicide Attempt in Karnataka | Sakshi
Sakshi News home page

మహిళా పీడీఓకు వేధింపులు

Published Wed, Jan 22 2020 7:23 AM | Last Updated on Wed, Jan 22 2020 7:23 AM

Woman Official Suicide Attempt in Karnataka - Sakshi

బాధితురాలు అనితారాజేశ్వరి(ఫైల్‌)

కర్ణాటక, మండ్య : విలేకరి, గ్రా.పం.సభ్యుడి వేధింపులు తాళలేక గ్రా.పం.మహిళా అధికారిణి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం భారతీనగర్‌లో చోటు చేసుకుంది. భారతీనగర్‌ గ్రా.పం.అధికారిగా విధులు నిర్వహిస్తున్న అనితారాజేశ్వరిపై గ్రా.పం.సభ్యుడు, ఓ వారపత్రిక విలేకరి ఏడాది కాలంగా వేధింపులకు పాల్పడుతున్నారు. గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న తల్లి కమలాక్షితో ఆమె తనగోడు వెల్లబోసుకుంది.   వేధింపులు పునరావృతమైతే సహించేది లేదంటూ ఏఎస్‌ఐ ఆ ఇద్దరినీ హెచ్చరించింది. అయినప్పటికీ వేధింపులు ఆపలేదు. దీంతో  మనస్తాపం చెందిన అనితా రాజేశ్వరి మంగళవారం కార్యాలయంలోనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు.  సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై భారతీనగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement