కారులోంచి బయటకు ఈడ్చి.. భర్త కళ్ల ముందే.. | Woman Raped infront of husband in gurgaon | Sakshi
Sakshi News home page

కారులోంచి బయటకు ఈడ్చి.. భర్త కళ్ల ముందే..

Published Tue, Jan 23 2018 4:21 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

Woman Raped infront of husband in gurgaon - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న నిందితులు

గురుగ్రామ్‌ : రోడ్డు పక్కన ఆగివున్న కారులోంచి బయటకు ఈడ్చి కుటుంబసభ్యుల కళ్ల ముందే మహిళ(22)ను రేప్‌ చేసిన సంఘటన గురుగ్రామ్‌లో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫంక్షన్‌కు వెళ్లిన సోదరుడి కారులో మహిళ, ఆమె భర్త ఆదివారం తిరిగి ఇంటికి బయల్దేరారని చెప్పారు. నగరంలోని సెక్టార్‌ 56లో టాయిలెట్‌కు వెళ్లేందుకు బాధితురాలి భర్త కారును దిగినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న నలుగురు కార్లలో వచ్చి ఇక్కడేం పని? అంటూ బాధితురాలి సోదరుడిపై చేయి చేసుకున్నారని వెల్లడించారు.

అదే సమయంలో టాయిలెట్‌ నుంచి బయటకు వచ్చిన మహిళ భర్తపై కూడా నలుగురూ దాడి చేశారని చెప్పారు. కారులో మహిళ ఉన్నట్లు గుర్తించిన ఓ వ్యక్తి ఆమెను కారులో నుంచి బయటకు లాగినట్లు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న పొదల్లోకి ఆమెను లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ విషయం బయటకు చెబితే ప్రాణాలు తీస్తామని మహిళతో పాటు కుటుంబ సభ్యులను బెదిరించినట్లు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన వివరాలతో కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement