
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో వివాహిత బలవ్మరణానికి పాల్పడిండి. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్‌ఎంటీ కాలనీకి చెందిన మణెమ్మ గురువారం తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే మణెమ్మ మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మగ బిడ్డ కోసం అల్లుడు వెంకటేశ్వర్లు తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. ఇందులో భాగంగానే మణెమ్మను హతమార్చి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టటారు. అనుమానితుడు వెంకటేశ్వర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment