
శంషాబాద్ రూరల్: గుర్తు తెలియని ఓ మహిళను దుండగులు దారుణంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోలుతో తగులబెట్టారు. మం డల పరిధిలోని చౌదరిగూడ శివారులో మంగళవారం ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. చౌదరిగూడ రెవెన్యూ పరిధిలోని ఓ వెంచర్‌లోని నిర్జన ప్రదేశంలో కాల్చివేసిన ఓ మహిళ మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్ సంఘటనాçస్థలిని పరిశీలించారు. దుండగులు గుర్తు తెలియని మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోలుతో కాల్చిన ఆనవాళ్లు గుర్తించారు. మూడు రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుందని వారు అనుమానిస్తున్నారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్లు ఉండొచ్చన్నారు. మృతురాలికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకుండా దుండగులు జాగ్రత్తపడ్డారు. ఈ ప్రాంతం నిర్జన ప్రదేశం కావడంతో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతరం సంఘటనా స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment