పాముకాటుతో మహిళ మృతి | women died with snake byte | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Published Wed, Apr 4 2018 1:43 PM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

women died with snake byte - Sakshi

ఎల్లమ్మకు తలకొరివి పెడుతున్న కూతురు దివ్య 

రాయపోలు(దుబ్బాక): పాముకాటుకు గురైన మహిళ ఆసుపత్రిలో చికి త్స పొందుతూ మృతిచెందిన సంఘటన దౌల్తాబాద్‌ మండలం ఉప్పర్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మద్దెల ఎల్లమ్మ(38) ఆదివారం పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆరుబయట కూర్చున్న కాసేపటికే అస్వస్థతకు గురైన ఎల్లమ్మ నోట్లో నుంచి నురగలు కక్కింది.

దీంతో పాముకాటు వేసిందని నిర్ధారించుకున్న కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఎల్లమ్మ మృతిచెందింది. మృతురాలికి భర్త పెంటయ్యతో పాటు ఓ కూతురు దివ్య ఉంది. కొడుకులు లేకపోవడంతో ఎల్లమ్మకు కూతురు తలకొరివి పెట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement