
మంగమ్మ మృతదేహం
మోతె (కోదాడ) : సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని తుమ్మగూడెంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మగూడెం గ్రామానికి చెందిన ఉబ్బపల్లి బాలయ్య భార్య ఉబ్బపల్లి మంగమ్మ(48) తెల్లవారుజామున తన ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు ఓల్డర్‌లో ఫ్లగ్ పెడుతోంది. ఈ క్రమంలో బోర్డులో లూజ్ కనెక్షన్ ఉండడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది.
కుటుబం సభ్యులు బిగ్గరగా కేకలు వేయడంతో ఎస్సీ కాలనీవాసులు వచ్చి విద్యుత్ తీగను తొలగించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరి యా ఆస్పత్రికి తరలించారు.మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. మృతురాలి భర్త బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నయోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాగయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment