అమెరికాకు టిక్కెట్లు బుక్‌.. అంతలోనే అదృశ్యం | Women Missing in Hyderabad | Sakshi
Sakshi News home page

గృహిణి అదృశ్యం

Published Mon, Feb 25 2019 9:25 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Women Missing in Hyderabad - Sakshi

అమృత(ఫైల్‌)

చిక్కడప్లలి: అమెరికాకు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ఓ మహిళ ఆకస్మాత్తుగా అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాష్‌ అనే వ్యక్తి తన భార్య అమృత(29), ఇద్దరు పిల్లలతో గత ఆరేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. గత నవంబర్‌ 8న వారు సెలవుల నిమిత్తం నగరానికి వచ్చారు.  ఈ ఏడాది జనవరి 1న ప్రకాష్‌ అమెరికా వెళ్లిపోగా, అమృత ఈ నెల 25న అమెరికా వెళ్లేందుకు టిక్కెట్లు బుక్‌ చేసుకుంది. ఈ నెల 23న బయటికి వెళ్లిన ఆమె తిరిగిరాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు. అమృత తల్లి గంగ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement