గువహటి : అసోంలో దారుణం చోటుచేసుకుంది. రైలులో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి అనంతరం హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు వికాస్ దాస్, విపిన్ పాండేలను దిగ్రూగర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అసోం వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థిని మృతదేహాన్ని శివసాగర్ జిల్లాలోని సిమలుగురి రైల్వే స్టేషన్‌లో గుర్తించగా, మరో మృతదేహాన్ని శుక్రవారం జోర్హాత్ జిల్లాలోని మరియాని స్టేషన్ వద్ద అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్‌లో కనుగొన్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తొలుత వికాస్ దాస్‌ను చిరింగ్ చపోరి ప్రాంతంలో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నేరాన్ని అంగీకరించిన దాస్ మరో నిందితుడి గురించి సమాచారం అందించగా దిబ్రూగర్ స్టేషన్ నుంచి బెంగళూర్ వెళుతున్న పాండేను అదుపులోకి తీసుకున్నామన్నారు.
బాధితులను ముందు స్పృహ కోల్పోయేట్టు చేసి అనంతరం వారిపై లైంగిక దాడి జరిపి హతమార్చామని నిందితుడు వెల్లడించాడని పోలీసులు చెప్పారు. వారి మృతదేహాలను రైళ్లలో టాయ్‌లెట్స్‌లో పడవేశామని నిందితుడు తెలిపాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment