డబ్బుతో సెటిల్‌ చేయాలని చూస్తే..  | women suicide attempt in mahabubabad | Sakshi
Sakshi News home page

డబ్బుతో సెటిల్‌ చేయాలని చూస్తే.. 

Published Sat, Oct 28 2017 11:52 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

 women suicide attempt in mahabubabad

సాక్షి, మహబూబాబాద్‌: ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చివరకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి ప్రియురాలిని వదిలించుకోవడానికి యత్నించాడో వ్యక్తి. దీంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బయ్యారం శివారు బాలాజీపేటకు చెందిన కార్తీక్‌ అనే యువకుడు గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పి ఆమె వెంట తిరిగిన యువకుడు పెళ్లి పేరు చెప్పేసరికి తప్పించుకోవడం ప్రారంభించాడు.

గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో.. గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఈ అంశాన్ని సెటిల్‌ చేయమని కార్తిక్‌ ప్రాదేయపడ్డాడు. ఈ విషయం తెలియడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement