
మనోజ్ (ఫైల్ )
సాక్షి, చిత్తూరు : యువకుడు తెలుగుగంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన సంఘటన ఉబ్బలమడుగు అడవిలో మంగళవారం జరిగింది.. పోలీసుల కథనం మేరకు చెన్నైకు చెందిన మహేష్‌కుమార్ కుమారుడు మనోజ్ (24) స్నేహితులైన మాణిక్యం, ప్రశాంత్‌తో కలసి మంగళవారం ఉబ్బలమడుగు అడవిలోని జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. మనోజ్ స్నేహితులతో కలసి తెలుగు గంగ మెయిన్ కాలువపై నిలుచుని సెల్ఫీ తీసుకునేందుకు ఉపక్రమించాడు. కాలుజారి కాలువలో పడిపోయాడు. కాలువలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.. ఈ విషయన్ని మాణిక్యం, ప్రశాంత్ స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ ధర్మారెడ్డి కేసు నమోదు చేసుకుని, మృతదేహాం కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment