
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరు సంవత్సరాల చిన్నారిపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన కే. గంగవరం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కే .గంగవరం మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల చిన్నారిపై 23 సంవత్సరాల యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దీంతో చిన్నారి తల్లి గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని రామచంద్రపురం హాస్పిటల్ కి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment