
మనిమేఘలై (ఫైల్), ప్రియుడు రాజ్‌కుమార్
సాక్షి, చెన్నై: ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తిరుత్తణిలో శనివారం చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపం నల్లాట్టూరు గ్రామానికి చెందిన మణి కుమార్తె మనిమేఘలై(20). అదే ప్రాంతం తాళవేడు గ్రామానికి చెందిన మునిరత్నం కుమారుడు రాజ్‌కుమార్(25). వీరిద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజ్‌కుమార్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో వీరిద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెళ్లికి రాజ్‌కుమార్ కుంటుంబీకులు వ్యతిరేకత తెలిపారు. దీంతో మనిమేఘలై వివాహం చేసుకోవాలని రాజ్‌కుమార్‌ను కోరినా పట్టించుకోలేదని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన మనిమేఘలై శనివారం ఉదయం ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పోలీస్ కమిషనర్ మానవీయత
Comments
Please login to add a commentAdd a comment