బ్యూటీ పార్లర్‌లో యువతి అనుమానాస్పద మృతి | Young Women Died In A Suspicious In Guntur | Sakshi
Sakshi News home page

బ్యూటీ పార్లర్‌లో యువతి అనుమానాస్పద మృతి

Published Thu, Jun 21 2018 1:37 AM | Last Updated on Tue, Sep 4 2018 4:54 PM

Young Women Died In A Suspicious In Guntur - Sakshi

మృతి చెందిన సిరి

రేపల్లె : గుంటూరు జిల్లా రేపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్‌లో తెలంగాణకు చెందిన ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఉరి వేసుకుని చనిపోయిందని సిబ్బంది చెబుతున్నా.. అక్కడ ఆ తరహా అనవాళ్లు లేకపోవటం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. రేపల్లెలోని ‘డూ ఆర్‌ డై బ్యూటీ పార్లర్‌’లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో ఉంటున్న తోట సింధు అనే మహిళ ఈ బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. ఇందులో పనిచేసేందుకు యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకకు చెందిన జి.సిరి (18) బుధవారం ఉదయమే వచ్చి చేరింది.

అయితే సాయంత్రం పార్లర్‌ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. కిందికి దించి చూడగా చనిపోయి ఉంది. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్ల వయసున్న యువతులతో బ్యూటీ పార్లర్‌ నడుపుతున్న నిర్వాహకురాలు సింధు హైదరాబాద్‌లో ఉంటోంది. బ్యూటీపార్లర్‌ను నడిపేందుకు లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్‌ నుంచి ముగ్గురు నుంచి ఆరుగురికి వేల రూపాయల్లో జీతాలిస్తూ ఇక్కడ పనిచేయిస్తుండడం నమ్మశక్యంగా లేదని స్థానికులు చెబుతున్నారు. బ్యూటీ పార్లర్‌లో ఇతర కార్యకలాపాలు సైతం నిర్వహిస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలి తండ్రి టీడీపీ నాయకుడు కావటంతో కేసును మాఫీ చేసేందుకు ఆ పార్టీ నేతలు రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement