
భగవతి (ఫైల్)
పటాన్‌చెరు టౌన్: డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ దేవేందర్ కథనం ప్రకారం.. పటాన్‌చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన ఉరుసు భద్రాచలం కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతడి కూతురు భగవతి (19) స్థానికంగా ఉన్న జీటీఎన్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భగవతి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకి లభించలేదు. దీంతో కూతురు అదృశ్యంపై తండ్రి భద్రాచలం ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment